Begin typing your search above and press return to search.
అరకు సీటు ఆయన కుమారుడికే!
By: Tupaki Desk | 29 Sep 2018 12:00 PM GMTమావోయిస్టుల చేతిలో కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురికావడంతో ఖాళీ అయిన అరకు ఎమ్మెల్యే సీటు ఎవరికి దక్కబోతోంది? తెలుగుదేశం పార్టీ వర్గాల్లో- అరకులో ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన చర్చల్లో ఇదొకటి. అయితే, ఈ ప్రశ్నకు టీడీపీ అధినేత - ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు స్వయంగా సమాధానం ఇచ్చేశారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం మాటల ప్రకారం చూస్తే కిడారి పెద్ద కుమారుడికే సీటు ఖాయమని వారు అంచనా వేస్తున్నారు.
అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు శనివారం పాడేరు వెళ్లారు. కిడారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం అందిస్తామని.. పార్టీ తరఫున నలుగురు కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని సీఎం ప్రకటించారు. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో.. వారికి విశాఖలో స్థలం ఇస్తామని - ఇల్లు కట్టుకోవడంలో సాయం చేస్తామనీ తెలిపారు. కిడారి చిన్న కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. పెద్ద కుమారుడికి ఏం చేయనున్నారనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేదు. పార్టీలో చర్చించిన తర్వాత పెద్ద కుమారుడి విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
దీంతో చంద్రబాబు మాటలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అరకు ఎమ్మెల్యే సీటును కిడారి పెద్ద కుమారుడికి ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని.. అందుకే ఆయనకు సాయం విషయంలో స్పష్టత ఇవ్వలేదని విశ్లేషిస్తున్నారు. మావోయిస్టుల నుంచి ముప్పు ఉంటుందని ఆలోచించి వెనుకంజ వేస్తే తప్ప.. అరకు సీటు కిడారి కుమారుడికి ఖాయమని అంచనా వేస్తున్నారు. త్వరలోనే పార్టీలో చర్చించి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు, కిడారి తోటు మావోల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కుటుంబ సభ్యులను కూడా సీఎం పరామర్శించారు. సోమ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున - పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. సోమ కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం ఇస్తామని - రెండో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.