Begin typing your search above and press return to search.
వాస్తవవాది బాబు దేవుడ్ని నమ్ముతారా?
By: Tupaki Desk | 16 Oct 2015 11:57 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వాస్తవవాది అంటారు. అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో పూజలు.. పునస్కారాలు.. దేవుడు.. సిద్ధాంతులు.. పూజారులు ఇలా అధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నారు?ఇలా ఎలా జరుగుతుంది? ఇలాంటి సందేహాలకు తాజాగా చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
ఒక ప్రముఖ వార్తా సంస్థతో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా సదరు వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన చాలా అంశాల గురించి మాట్లాడారు. అమరావతి గురించి.. అమరావతి అభివృద్ధి గురించి ప్రశ్న అడగటం తడువు నాన్ స్టాప్ గా సమాధానం చెప్పిన చంద్రబాబు మాటలకు కాస్తంత బ్రేకులు వేసేందుకు సదరు ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి ఒక ప్రశ్న వేశారు.
వాస్తవవాది అయిన చంద్రబాబు దేవుడ్ని నమ్మతున్నారేంటి? అంటూ ఓ ప్రశ్న వేశారు.
దీనికి తనదైన శైలిలో చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తాను వాస్తవవాదినేనని చెప్పిన ఆయన.. తాను ప్రజల్ని నమ్ముతానని చెప్పారు. మరి.. ఆ ప్రజలంతా నమ్మేది దేవుడ్నినని.. సైంటిస్ట్ కానీ.. సాధారణ ప్రజల వరకూ అందరూ దేవుడ్ని నమ్ముతున్నారు. మరి.. అలాంటప్పుడు ప్రజలు నమ్మే దేవుడ్ని నమ్మితే తప్పేంది? ప్రజలు నమ్మేదాన్ని తాను పాటిస్తానని.. వారి ఆలోచనలే తనకు ముఖ్యమంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. వాస్తవవాది అయిన చంద్రబాబు.. ప్రజలకు తగినట్లుగా తాను మారతారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.