Begin typing your search above and press return to search.
ఏంది బాబూ ఇది..ఒక్క భోజనం రూ.70 వేలా?
By: Tupaki Desk | 28 Jun 2017 1:22 PM GMTఆ భోజనం ఖరీదు సుమారు 70 వేల రూపాయలు! అదేదో వీఐపీ పెళ్లి విందు భోజనం అనుకుంటే మీరు ముద్దపప్పులో కాలేసినట్లే! సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ వర్క్ షాప్ సందర్భంగా ఒక్కో ప్రముఖుడిపై ఖర్చు చేసిన మొత్తం అది. అన్ని ఖర్చులు కలుపుకొని ఒక్కో ప్రముఖుడిపై రూ. లక్ష ఖర్చు చేశారు. పై సమాచారాన్ని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఓ సామాజిక కార్యకర్త సేకరించాడు. ఏపీ ప్రభుత్వం 19మంది ప్రముఖుల భోజనాలు - సదుపాయాల కోసం సుమారు రూ.19లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 23 - 24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో 'ఇంటలెక్చువల్ ప్రాపర్టీ - కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్' అనే అంశంపై రెండు రోజులపాటు అంతర్జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించింది. ఈ సమావేశానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
వర్క్ షాప్ అనంతరం వీరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందు కోసం ప్రభుత్వం రూ. 13,38,720 ఖర్చు చేసింది. మరో రూ.4,90,705లను వారికి కల్పించిన సదుపాయాల కోసం ఖర్చు చేసింది.
అంటే మొత్తం రూ.18,29,425లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నమాట. 19 మంది ప్రముఖులకు దాదాపు 19 లక్షలు. దాదాపుగా తల ఒక్కింటికి లక్ష రూపాయలు. ప్రభుత్వం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల విపక్ష పార్టీల నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టవచ్చు గానీ, ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/