Begin typing your search above and press return to search.

హాయిగా నవ్వుకోండి..ఇవీ బాబు గారి ఆస్తులట

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:12 AM GMT
హాయిగా నవ్వుకోండి..ఇవీ బాబు గారి ఆస్తులట
X
నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. అంతే కాదు... జాతీయ స్ధాయిలో అందరి కంటే సీనియర్ నాయకుడు. దాదాపు నాలుగున్న దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. ఇవాళ రేపు రాజకీయాల్లోకి వచ్చిన వారికే వందల కోట్లు ఆస్తులుంటున్నాయి. కాని ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఆస్తులు మాత్రం చాలా తక్కువ. ఆయన టిక్కట్లు ఇస్తే శాసనసభకో - లోక్‌ సభకో లేదూ రాజ్యసభకో అవకాశం వచ్చిన వారి ఆస్తులే వందల కోట్లు ఉంటున్నాయి. కాని ఘనత వహించిన నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు మాత్రం కేవలం 2.99 కోట్లు మాత్రమే. ఇంతేనా అని అనుకోని ఆశ్చర్యపోకండి. పాపం ఆయనకి అంతకు మించి అప్పుల కూడా ఎక్కువే ఉన్నాయి. ఆయన ఆస్తులు 2.99 కోట్లు అయితే అప్పులు 5.31 కోట్లు. ప్రతి ఏటా నారా వారి కుటుంబం ప్రకటించే తమ ఆస్తుల వివరాలను ఈ సంవత్సరం కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఆయన తనయుడు నారా లోకేష్ తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు.

చంద్రబాబు నాయుడి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నగదు 4.8 లక్షలు - అంతే కాదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడికి 1993 సంవత్సరం నాటి అంబాసిడర్ కారు మాత్రమే ఉంది. దాని విలువ కేవలం 1. 5 లక్షల రూపాయలు. ఇక చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి నికర ఆస్తులు 31 కోట్లు అయితే మొత్తం ఆస్తుల విలువ 53.3 కోట్లు. ఇక చంద్రబాబు నాయుడి కుమారుడు - మంత్రి నారా లోకేష్ ఆస్తులు ఈ సంవత్సరం మార్చి 31 నాటికి 21.4 కోట్లు కాగా అప్పులు 5.88కోట్ల రూపాయలుగా నారా కుటుంబం పేర్కొంది. చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రహ్మణి ఆస్తులు 13.38 కోట్ల రూపాయలు కాగా వారి కుమారుడు దైవాన్ష్ ఆస్తుల 18.71 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ ఆస్తుల విలువ మార్కెట్ విలువ కాదని - ప్రభుత్వం విలువ కట్టిన విలువే అని మంత్రి లోకేష్ ప్రకటించారు.అంటే మార్కెట్ విలువన చూసుకున్నా ఈ మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లకు మించి ఉండదంటున్నారు. ఇంతేనా నారా వారి కుటుంబం సంపాదించుకున్న ఆస్తులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు.... దేశ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఇంతకు ముందు అసోసియేషన్ డెమక్రటిక్ రిఫామ్స్ సంస్ధ ప్రకటించిన అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో నారా చంద్రాబాబు ముందు వరుసలో ఉన్నారు. ఆ సంస్ధ వెల్లడించిన ఆస్తుల ప్రకారం చంద్రబాబు నాయుడి ఆస్తి 177 కోట్లు కాగా ఆయన తర్వాత అరుణా చల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండ్ ఆస్తులు 129 కోట్లు - ఆ తర్వాత స్ధానం పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆస్తులు 48 కోట్ల రూపాయలు. ఇక సిపిఎం నాయకుడు - త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ ప్రభు ఆస్తులు కేవలం 26లక్షల రూపాయలు మాత్రమే. ఇదీ చంద్రబాబు నాయుడి ఆస్తుల వివరాలు. ఇది చదివాక నవ్వకుండా ఉండగలమా....