Begin typing your search above and press return to search.

చంద్రబాబు వెళ్తే పెట్టుబడులే పెట్టుబడులు

By:  Tupaki Desk   |   20 Jan 2016 11:38 AM GMT
చంద్రబాబు వెళ్తే పెట్టుబడులే పెట్టుబడులు
X
మొన్నటికిమొన్న విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా నవ్యాంధ్రలో బంగారం తవ్వకానికి సంబంధించి ఓ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్‌ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లిన ఆయన అక్కడ వివిధ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా సుమారు 500 మిలియన్‌ డాలర్ల ఒప్పందాలు కుదిరాయి. మియర్‌ బర్గర్‌ - బీహెచ్‌ ఎం ఫార్చ్యూనర్ - ప్లీసమ్‌ - కెల్టర్‌ - మెర్జి - సీస్‌ - ఇండానీ గ్లోబల్‌ తదితర అంతర్జాతీయ సంస్థలతో చంద్రబాబు చర్చించారు. వాటిలో ఇండానీ గ్లోబల్ సంస్థ ఏపీలో బంగారం తవ్వకాలకు ముందుకొచ్చింది. బంగారు నిక్షేపాలున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ధరిస్తే మైనింగ్‌ చేసేందుకు తాము సిద్ధమని ఆ సంస్థ చెప్పింది. 300 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించింది. ప్లీసమ్‌ సంస్థ కూడా 200 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. పూర్తి వివరాలు అందిస్తే తాము కూడా సిద్ధమేనని మియర్‌ బర్గర్‌ సంస్థ కూడా చెప్పినప్పటికీ ఎక్కడ నిక్షేపాలున్నాయి... ఏ స్థాయిలో ఉన్నాయన్న వివరాలు ఇచ్చాకే తమ పెట్టుబడుల సంగతి చెప్పగలమని మియర్ బర్గర్ వెల్లడించింది.

మరోవైపు ఫండ్‌ మేనేజ్‌ మెంట్‌ రంగంలో ప్రసిద్ధి చెందిన బీహెచ్‌ ఎం ఫార్య్చూనర్ గ్రూప్‌ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సంస్థ ఫండ్‌ మేనేజ్‌ మెంట్‌ తో పాటు బయోటెక్‌ - బయో మెడికల్ పరికరాల ఉత్పత్తి సంస్థల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫ్లెక్సిబుల్‌ సోలార్‌ మాడ్యూళ్ల తయారీలో ప్రసిద్ధి చెందిన ప్లీసమ్‌ సంస్థ 200 మిలియన్‌ డాలర్లు పెట్టనుంది. రాజధాని నిర్మాణంలో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని చెప్పగా వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని సీఎం సూచించారు. నగర ప్రణాళికలో అనుభవం ఉన్న న్యూసెచ్‌ కంపెనీ ప్రతినిధుతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. బికెడబ్ల్యుతో హైడ్రో పవర్‌ జనరేషన్‌ పై, మెర్జీ సంస్థతో వస్ర్త ఉత్పత్తిపై చర్చించారు. ఏపీలో రూ.వేల కోట్లతో మెగా టెక్స్‌ టైల్‌ పార్కుకు ఆసంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇండానీ గ్లోబర్‌ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. విశాఖలో కాఫీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది.