Begin typing your search above and press return to search.
పాత ట్రెండ్‌నే ఫాలోఅవుతానంటున్న బాబు!
By: Tupaki Desk | 15 Oct 2017 4:55 AM GMT`కేరెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది` అనే సినిమా డైలాగ్ ఏపీ సీఎం చంద్రబాబు సరిపో తుందేమో!! ఎందుకంటే కొద్ది రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది మరి! అదేంటో తెలుసుకోవా లంటే కాస్తంత ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే! `నేను గతంలోలా కఠినంగా వ్యవహరించను. నేను మారాను. నన్ను నమ్మండి` అంటూ 2014 ఎన్నికల సమయంలో ఆయన ఉద్యోగులను ప్రాధేయపడినంత పనిచేశారు. ఇవి నమ్మిన ఉద్యోగులు ఆయనతో ఉన్నా.. తర్వాత తన వైఖరి ఏమాత్రం మారలేదని నిరూపిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలతో బాబు వారికి షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి పాత చంద్రబాబును గుర్తుకు తెస్తూ.. ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు!
పని విషయంలో చంద్రబాబు నిక్కచ్చిగా ఉంటారు. అఫ్‌కోర్స్ అందరూ ఇలానే ఉన్నా.. ఆయన మరికొంత ఎక్కువ క్రమశిక్షణగా ఉంటారు. ఇదే ఉద్యోగులకు టార్చర్ చూపిస్తుంది మరి! `నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను` అని భీష్మించుకుని కూర్చుంటే.. పాపం ఆ చిరుద్యోగులు ఎంతని తట్టుకోగలరు! గతంలో చంద్రబాబు సీఎంగా చేసిన సమయంలో.. అధికారులపై ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చేవారో తెలిసిందే! ఆకస్మికంగా తనిఖీలు చేసి అధికారులకు ఊపిరి సలపనివ్వకుండా చేసేవారు. ఇదే ఆయనపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన ఆయన 2014లో `నేను మారాను` అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు తన పాత రూట్‌లోకి వచ్చేశారు. పాత ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. గతంలోలా ఆకస్మిక తనిఖీలతో అధికారుల గుండెల్లో దడ పుట్టించేస్తున్నారు. ఏడాది క్రితం ఓసారి ఆకస్మిక తనిఖీలు చేపట్టినా ఆ తరువాత దాన్ని కొనసాగించలేదు. ఇప్పుడు తాజాగా మళ్లీ తన పాత ట్రెండ్ కు తెరతీశారు చంద్రబాబు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలసి విజయవాడలోని పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. గవర్నర్ పేటలోని ఆర్టీసీ-2 డిపో, కంట్రోల్ రూమ్ సమీపంలోని స్క్రాప్ పార్క్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పాత బస్టాండు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్కు కాలువ గట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను కూడా పరిశీలించారు. ఆ తర్వాత బస్టాండులోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనిఖీలను కొనసాగించారు. ఈ క్రమంలో విజయవాడ నగరంలోని పలు అభివృద్ధి పనులను కూడా ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాపం ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న ఉద్యోగులకు ఇక నుంచి సీఎం ఫీవర్ పట్టుకోవడం ఖాయమేమో!!