Begin typing your search above and press return to search.
మోదీ నజర్..ఇదీ చంద్రబాబులో కొత్త ఫియర్
By: Tupaki Desk | 29 Aug 2018 5:18 AM GMTమోదీ సక్సెస్ లో ఆయన చురుకుదనం - రాజకీయ చాతుర్యం - కమిట్ మెంట్ - వ్యూహ సామర్థ్యం వంటివాటితో పాటు ఇంకో కీలక అంశం కూడా ఉందని చెబుతుంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు. అది.. నిఘా. మోదీ అంటే నిఘాకు మారుపేరంటారు. ఆయన డేగ కన్ను నుంచి సొంత పార్టీ నేతలైనా - ప్రత్యర్థులైనా - ఇంకెవరైనా కూడా తప్పించుకోలేరని చెబుతారు. అందుకు ఉదాహరణలు కూడా చెబుతుంటారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై పోయెస్ గార్డెన్ లోనే కుట్ర పన్నుతున్నారంటూ అప్పట్లో మోదీ అలర్ట్ చేయడంతోనే ఆమె తెలుసుకుని శశికళను బయటకు గెంటేసిందని చెబుతారు. అలాగే... ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఓ మహిళపై నిఘా పెట్టడం.. ఆ తరువాత ప్రధాని అయిన తరువాత కూడా తన మంత్రులు చెప్పే అబద్ధాలను కూడా ఆయన తన నిఘా సామర్థ్యంతో తెలుసుకుని వారికి వార్నింగ్ లు ఇవ్వడం వంటివి ఆయన నిఘా పవర్ కు ఉదాహరణగా చెబుతుంటారు. ఇవన్నీ తెలియడం వల్లో ఏమో కానీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉంటున్నారట.. తనపై మోదీ నిఘా ఉందని నిత్యం టెన్షన్ పడుతున్నారని వినిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన విదేశీ పర్యటనలు బంద్ చేశారని టాక్.
మామూలుగా చంద్రబాబు ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తుంటారు. దేశీయంగానైనా - విదేశాలకైనా ప్రత్యేక విమానాల్లో కూడా వెళ్తుంటారాయన. పెట్టుబడులను రప్పించడానికని.. అమరావతి బ్రాండింగ్ కని చెబుతూ ఆయన విదేశాలకు వెళ్లి వస్తుండేవారు. అయితే, కొద్దికాలంగా ఆయన విదేశీ పర్యటనలు ఆగిపోయాయి. అమరావతిని నిర్మిస్తున్న సింగపూర్ కూడా వెళ్లడం లేదాయన.
సింగపూర్ లో తానేం చేస్తున్నానో... తన పర్యటనలకు ఎంత డబ్బు వృథా చేస్తున్నానో కేంద్రం - బీజేపీ బయటపెట్టి ఎండగట్టే ప్రమాదముందని ఆయన అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే చంద్రబాబు ముందు జాగ్రత్తగా మోదీ దృష్టికి దొరక్కుండా బయట దేశాలకు వెళ్లడంలేదని ఆయన విమర్శకులు అంటున్నారు.