Begin typing your search above and press return to search.
సుజనా మీద నమ్మకం తగ్గుతోందా
By: Tupaki Desk | 5 March 2018 6:05 AM GMTకేంద్ర మంత్రి సుజనా చౌదరి మీద చంద్రబాబు నాయుడుకు నమ్మకం తగ్గుతోందా అనే ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా భాజపా తరపున బ్యాటింగ్ చేస్తున్నాడనే అనుమానం చంద్రబాబులో పెరిగిందా అని అంతా అనుకుంటున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా తో చర్చలు జరపడానికి ఇప్పటికే ఒకసారి సుజనా చౌదరి ని పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు ఈ దశలో కౌంటర్ కోసం మరికొందరిని నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల వెంకయ్యనాయుడు సమక్షంలో ఢిల్లీలో అమిత్ షాతో చర్చలు జరిగి నప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు - ప్రణాళికా సంఘం చైర్మన్ కుటుంబరావుల మాత్రం చంద్రబాబు నాయుడు పంపిన సంగతి తెలిసిందే . భాజపాతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన తరువాత అమిత్ షా నుంచి మళ్లీ ఫోన్ రావడంతో చంద్రబాబు తరఫున మరో జట్టు చర్చలకు వెళ్లనుంది.
ఈ జట్టులో మాత్రం సుజనా చౌదరి కూడా ఉన్నారు . ఎంపీ రామ్మోహన్ నాయుడు కుటుంబరావు లను యధావిధిగా పంపుతున్నారు . తాజాగా రాష్ట్ర అంశాల ప్రస్తావన కోసం మంత్రి యనమల రామకృష్ణుడు లు యనమల రామకృష్ణుడు ను కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది .
విభజన చట్టం హామీలను నెరవేర్చే విషయంలో కేంద్రం మాట తప్పుతోందని చంద్రబాబు నాయుడు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు . కేంద్రంతో చర్చలు జరిపే ప్రతిసారీ సుజనా చౌదరి మాత్రమే ప్రతినిధిగా వెళుతున్నారు . ఆయన రాష్ట్ర సమస్యలను సరిగ్గా ప్రస్తావించడం లేదని చర్చల్లో సరైన ఫలితాలు రావడం లేదని చంద్రబాబు భావించినట్లుగా తెలుస్తోంది . అందువల్ల కేంద్రంతో చర్చించే జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి . ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని కూడా ఈ జట్టుతో పాటు ఢిల్లీకి పంపనున్నారు .
ఇప్పటికే రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన బాగా ముదిరిన నేపథ్యంలో కొత్తగా చర్చలకు వెళుతున్న జట్టు ఏం సాధిస్తుందా ఏం లాభం రాబడుతుందా అని ప్రజలు సందేహంగా ఎదురుచూస్తున్నారు.
ఇదంతా కూడా చంద్రబాబునాయుడు కు కేంద్రంమంత్రి సుజనా చౌదరి చిత్తశుద్ధి - సామర్థ్యం నమ్మకం తగ్గుతన్నదనడానికి నిదర్శనమే అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.