Begin typing your search above and press return to search.
చంద్రబాబు భరోసా యాత్ర
By: Tupaki Desk | 14 Jan 2016 4:30 AM GMTహైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలై దాదాపు నెల రోజులు అవుతోంది. ఈ నెల రోజుల్లో స్థానిక టీడీపీ నేతలు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి నుంచి మినహా చంద్రబాబు వంటి కీలక నేతల నుంచి కనీసం ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నుంచి కనీసం ఒక్క ప్రకటన అయినా వెలువడుతుందని సెటిలర్లు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ, అటువంటి సంకేతాలు కనిపించలేదు. దాంతో చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేశారనే అభిప్రాయానికి వచ్చారు. మరికొంతమంది అయితే, కేసీఆర్ కు చంద్రబాబు భయపడుతున్నారని, ఓటుకు నోటు కుంభకోణం తర్వాత హైదరాబాద్ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు.. ఇక మళ్లీ ఇక్కడి రాజకీయాల్లో కలుగజేసుకోరాదని భావిస్తున్నట్లున్నారనే అభిప్రాయాలనూ వ్యక్తం చేశారు. సెటిలర్లకు హైదరాబాద్ లో భరోసా లేదనే అభిప్రాయాలనూ వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లోనే భరోసా లేని టీడీపీ వెంట నడవడం కంటే తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ ఎస్ కు మద్దతు ఇద్దామా అనే ఆలోచనలూ చేశారు. ఇటువంటి పరిస్థతుల్లోనే మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో శంఖారావం సభ జరిగింది.
శంఖారావం సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సెటిలర్లలో భరోసాను నింపాయని చెబుతున్నారు. నేనెక్కడికీ పోలేదని, ఇక్కడే ఉంటానని, నేనెక్కడ ఉన్నా నడిపించేది నేనేనన్న చంద్రబాబు వ్యాఖ్యలతో సెటిలర్లు తేరుకున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని, ఏపీ - తెలంగాణలు తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు వ్యాఖ్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు. దీనికితోడు ఈనెల 27, 28, 29 తేదీల్లో హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారనే కథనాలతో మరింత ఊరట చెందుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరిగే నాటికి మధ్యలో రెండు మూడుసార్లు అయినా చంద్రబాబు సెటిలర్లకు భరోసా ఇచ్చేలా ప్రకటనలు చేస్తే.. టీడీపీ నుంచి అటువంటి బలమైన సంకేతాలు ఇస్తే సెటిలర్లంతా మళ్లీ టీడీపీకే పట్టం కడతారనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.