Begin typing your search above and press return to search.
వెయ్యి నోట్ల రద్దు వెనుక చంద్రబాబు!!
By: Tupaki Desk | 8 Nov 2016 3:43 PM GMTరూ.500 - 1000 నోట్లను రద్దు చేసేలా ప్రధాని మోడీకి సిఫార్సు చేస్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన మాట ఇది. ఈ మాట విన్న వారంతా చంద్రబాబుకు పైత్యం తలకెక్కిందనుకున్నారు. కేంద్రం రూ.2000 నోట్లను తీసుకొస్తానని సూచించడంతో చంద్రబాబుది అంతా పిచ్చితనం అనుకున్నారు. కానీ.. చంద్రబాబు నిజంగా ప్రధానికి చెప్పారా... చంద్రబాబు చెబితే ప్రధాని విన్నారా అన్నట్లుగా మోడీ ఈ రోజు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి 500 - 1000 నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం నిరోధానికి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రధాని నిర్ణయంతో నల్లధనం పోగేసుకున్నవారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమ వద్ద కట్టలుకట్టలుగా ఉన్న లిక్విడ్ క్యాష్ ను ఏం చేయాలా అని తల పట్టుకుంటున్నారు. 500 - 1000 నోట్లను మార్చుకోవడానికి డిసెంబరు 30 వరకు ప్రధాని టైమిచ్చినా కూడా లెక్కల్లో చూపని ఆ డబ్బును వెనక్కి ఇవ్వలేక.. వృథాగా ఉంచుకోలేక ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు.
కాగా నల్లధనం - ఫేక్ కరెన్సీ సమస్యకు పరిష్కారంగా మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లో భాగంగా క్యాష్ ట్రాంజక్షన్ ను ఆపడానికి ఇప్పటికే బయట ఉన్న ఆ నోట్లను వెనక్కి తెప్పించడానికి గాను రెండు రోజుల పాటు 9 - 10 తేదీల్లో దేశవ్యాప్తంగా ఏటీఎంలు పనిచేయకుండా చేస్తున్నారు. తొలుత ఈ మిషన్ అంతా పూర్తయిన తరువాత కొత్త 500 నోట్లు - 2000 నోట్లను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/