Begin typing your search above and press return to search.

గవర్నర్ అంత సీన్ లేదు..గేమ్ అంతా బాబుదే!

By:  Tupaki Desk   |   5 March 2017 8:02 AM GMT
గవర్నర్ అంత సీన్ లేదు..గేమ్ అంతా బాబుదే!
X
ఏపీలో ఫిరాయింపుదారుల రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది. దాదాపు ఏడాది కిందట పచ్చ కండువా వేసుకున్న వారికి గట్టి హామీలే ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అధినేత. ఫిరాయించిన ఇరవై మందిలో దాదాపు అరడజను మందికి మంత్రి పదవి అనే హామీని దట్టించి వదిలాడు. అప్పటి నుంచి వారు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకూ అనేక దఫాలుగా మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఇప్పుడు ఎట్టకేలకూ అది జరిగేలా ఉంది. మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ల కోసం కాదు, లోకేష్ బాబు కోసం అయినా.. మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. లోకేష్ కు మంత్రి పదవి విషయంలో ఇంట్లోంచి బాబు మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. తన భర్తను మంత్రిగా చూసుకోవాలనేది బ్రహ్మణి కోరికగా తెలుస్తోంది. దీంతో బాబు కూడా తప్పని సరిగా విస్తరణ చేయాల్సి వస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలో గెలవలేదు.. అని జనాలు వెక్కిరిస్తున్నా, ఈ విధంగా లోకేష్ ను మంత్రిగా చేసేస్తున్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు.

మరి ఆ సంగతిలా ఉంటే.. ఇప్పుడు ఫిరాయింపుల తలనొప్పిని వదిలించుకోవడానికి బాబు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఇస్తే సహించేది లేదని సొంత పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో.. ఫిరాయింపుదారులతో ఇప్పుడు పెద్దగా ఉపయోగం కూడా లేదని తేలిన తరుణంలో బాబు గవర్నర్ ను అడ్డం పెట్టుకుని తన వ్యూహాన్ని అమలు పెడుతున్నాడు.

ఫిరాయింపుదారుల చేత ప్రమాణ స్వీకారం చేయించను.. అని గవర్నర్ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో ఒక లీకు వస్తోంది. దాని వెనుక ఉన్నది చంద్రబాబే అని స్పష్టం అవుతోంది. గవర్నర్ కు ఉన్న నిర్ణయాధికారాన్ని ఒకసారి పరిశీలిస్తే.. ఫలానా వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాను, ఫలానా వారి చేత చేయించను అనేంత అధికారం ఆయనకు లేదు. సీఎం చెప్పిన వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం గవర్నర్ పని!

తెలంగాణ విషయంలో ఇదే జరిగింది. ఫిరాయింపుదారుడైన తలసాని చేత ఇదే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాడు. మరి ఏపీలో ఎందుకలా జరగదు? రెండు రాష్ట్రాలకూ అదే గవర్నర్ కదా.. ఒక చోట చేయించి, మరో చోట చేయించను అని ఎలా అంటాడు? అనలేడు కదా! వాస్తవానికి గవర్నర్ కూడా ఆ మాట అనలేదు. ఫిరాయింపుదారుల్లోని మంత్రి పదవుల ఆశావహుల తలనొప్పిని వదిలించుకోవడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా గవర్నర్ ను వాడుకుంటున్నారు. ఆయన ఒప్పుకోలేదు.. అందుకే మీకు మంత్రి పదవులు ఇవ్వలేననే సంకేతాలు ఇచ్చి.. వైకాపా నుంచి ఫిరాయించి వచ్చిన వారికి గట్టి షాకే ఇచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/