Begin typing your search above and press return to search.
ఏపీ ప్రజలకు బాబు బర్త్ డే కానుక
By: Tupaki Desk | 20 April 2016 10:09 AM GMT60ల్లో 20.. ఈ మాటకు అసలైన నిర్వచనం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రం కోసం పరితపిస్తూ.. కుటుంబంతో గడపాల్సిన ఆనంద క్షణాలను కూడా ప్రజల్లోనే ఉంటూ వారి చిరునవ్వుల్లోనే కుటుంబంతో ఉన్న క్షణాలను గుర్తుచేసుకునే నేత!! 60ఏళ్లు పైబడినా నవ యువకుడిగా.. దార్శనికుడిగా.. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 20. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అలాంటిది మరి చంద్రబాబు పుట్టిన రోజున ఆంధ్రా జనానికి కొత్త పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నారు.
ఇప్పటికే ఏపీ సర్కారు పేద ప్రజల కోసం ఎన్టీఆర్ వైద్య సేవను ప్రారంభించింది. ఇందుకు కొనసాగింపుగా మరికొన్ని సేవలు పేద ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించేందుకు చంద్రన్న సంచార చికిత్స వైద్య వాహనాల పేరుతో కొత్త వాహన సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. ఖరీదైన సేవలుగా పేరొందిన సీటీ సీటీ స్కాన్ సౌకర్యాన్ని ఫ్రీ గానే జనానికి ఇక నుంచి అందనున్నాయి. ఇప్పుడు ఉచిత డయాలసిస్ తో అనేక ఖరీదైన సేవలను ప్రజలకు ఫ్రీగా అందిస్తారట. ప్రస్తుతం దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి - ప్రకాశం జిల్లా చీరాల - కడప జిల్లా ప్రొద్దుటూరు - గుంటూరు నగరంలో సీటీ స్కాన్ ను సేవల్ని 24 గంటలు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే అందుబాటులో ఉన్న 104 వాహనానికి మరిన్ని హంగులు, సేవలు చేర్చి చంద్రన్న సంచార చికిత్స వాహనాల్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 వాహనాలు వివిధ గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తాయి. దీనికితోడు మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా ముఖ్యమంత్రి జన్మదినోత్సవం రోజున సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించబోతోంది. మంత్రి దేవినేని కూడా చంద్రబాబు పుట్టిన రోజునాడే ఒంటిమిట్ట రాముడి పాదాల వద్దకు నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టు ప్రారంభోత్సవం సెట్ చేశారు.