Begin typing your search above and press return to search.
కమిషన్ కు టైమ్ బౌండ్ వుంది -చంద్రబాబు
By: Tupaki Desk | 1 Feb 2016 4:20 PM GMT‘గతంలో ఇచ్చిన జీవో 30లో రిజర్వేషన్ లో కేవలం రిజర్వేషన్ ఇవ్వాలని మాత్రమే వుంది. కానీ.. కాపులను ఏ గ్రూపులో పెట్టాలి, దానికి విధి విధానాలేంటి అనేది లేదు. ఆల్రెడీగా వున్న జీవోను మళ్లీ ఇవ్వమంటే ఎలా? జీవో వుంది కదా అన్నాడు’ చంద్రబాబు. కాపు రిజర్వేషన్లపై జరుగుతున్న సంఘటనలపై చంద్రబాబు మీడియా ముందు స్పందించాడు. కమిషన్ కు సపోర్టివ్ గా ఈ జీవో పనిచేస్తుంది తప్ప.... జీవో ప్రకారం కమిషన్ పనిచేయదు. ఆ కమిషన్ కు 9నెలల పాటు టైం బౌండ్ పెట్టాం అన్నారు. అంతేగానీ లేని సమస్యలను సృష్టించడానికి ఈ రోజు కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదంతా ఓ నేరగాడి వల్లే జరుగుతోందన్నారు. తన తండ్రి గతంలో ఓ ఎనిమిది కులాలకు రిజర్వేషన్లు కల్పించాడు. మరి అప్పుడెందుకు ఆయన కాపు కులాలను చేర్చలేదని ప్రశ్నించాడు. నేను అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయిందని, అంతకు ముందు పదేళ్లపాటు అధికారంలో వున్న పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు.
ఇదే వైఎస్సార్ పార్టీ తన మేనిఫెస్టోలో కమిషన్ వేస్తామని చెప్పింది. మరి వారెందుకు ఈ మాట అన్నారు. మేము కమిషన్ వేస్తామంటే కాలయాపన అంటున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బ్లేమ్ చేయడమే వారిపని. ఇది దారుణం అన్నారు. నిన్న రైలును తగలబెట్టడం వెనకు కచ్చితంగా ప్రీ ప్లాన్డే. అందుకే సాక్షి ఛానెల్ ముందుగానే అక్కడ ఆరు ఓబీ వ్యాన్లను వుంచింది. వారికి ముందే తెలుసు కాబట్టి ఇలా ముందుగా వారి ఛానెల్ ను అక్కడ వుంచారని అన్నారు.