Begin typing your search above and press return to search.
చంద్రబాబు మట్టిలో నడవాల్సి వచ్చింది
By: Tupaki Desk | 25 May 2016 4:46 AM GMTఅవును.. బాబు బస్సు మొరాయించింది. విపక్ష నేతగా ఉన్న రోజుల్లో ఆయన వాడే కార్లు తరచూ రిపేర్లకు గురి అయ్యేవి. దీంతో.. ఎక్కడ పడితే అక్కడ ఆ కార్లు ఆగి భద్రతా సిబ్బందికి చుక్కలు చూపించేవి. విపక్ష నేతగా ఉన్నప్పుడు పరిస్థితులు వేరు. అధికారం చేతిలో ఉన్న వేళ.. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు కదలకుండా మొరాయించటమా? అన్న సందేహం అక్కర్లేదు. నిజంగానే ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక బస్సు ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితి. అయితే.. దీనికి కారణం లేకపోలేదు.
అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ నిర్మాణ పనుల్ని సమీక్షించేందుకు చంద్రబాబు ప్రత్యేక బస్సులో వెళ్లారు.ఆయన ప్రయాణిస్తున్న బస్సు సచివాలయ బ్లాక్ వద్దకు వెళ్లేసరికి ముందుకు కదలకుండా మొరాయించింది.అక్కడి మట్టిలో బస్సు కూరుకుపోవటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో.. బస్సును మట్టి నుంచి బయటకు తీసేందుకు క్రేన్ ను ఉపయోగించినా బయటకు రాని పరిస్థితి. దీంతో.. కదలని బస్సులో నుంచి బాబు బయటకు వచ్చి.. మట్టిలో నడుచుకుంటూ సచివాలయం వైపు వెళ్లాల్సి వచ్చింది.
అయినా.. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సు వెళ్లేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయో లేదో అన్న విషయాన్ని కూడా అధికారులు చెక్ చేసుకోరా? మరీ.. అంత అజాగ్రత్తగా అధికారులు ఉన్నారా..?