Begin typing your search above and press return to search.

మనవడి బారసాల... ముఖ్యమంత్రి బిజీబిజీ

By:  Tupaki Desk   |   9 April 2015 1:00 PM GMT
మనవడి బారసాల... ముఖ్యమంత్రి బిజీబిజీ
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో శుక్రవారం బారసాల జరపనున్నారు. లోకేశ్‌ కుమారుడి బారసాల నిర్వహించనుండడంతో అటు చంద్రబాబు కుటుంబంతో పాటు ఇటు బాలయ్య కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. దీంతో శుక్రవారం చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు.

చంద్రబాబు నివాసంలో నిర్వహించే ఈ వేడుక ఏర్పాట్లన్నీ లోకేశే దగ్గరుండి చూసుకుంటున్నారట. ఉగాది రోజున లోకేష్‌, బ్రహ్మణి దంపతులకు అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తాతలు అయ్యారు. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్‌.. బాలకృష్ణ పెద్ద కూతురు బ్రాహ్మణికి 2007లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.