Begin typing your search above and press return to search.
కరెక్టు కాదేమో సీఎం గారు....
By: Tupaki Desk | 5 July 2015 4:03 AM GMT'ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతియుత పరిస్థితులు లేవు. ఏపీ వాసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. మన రాష్ర్టానికి తగిన న్యాయం చేయడంలో తెలంగాణ సర్కారు వివక్ష చూపుతోంది. విద్యావిధానం మొదలుకొని నిధుల వాటా కేటాయింపులోనూ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు' అంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు పార్టీల నేతలు, అధికారంలో ఉన్న మంత్రులు పలు సందర్భాల్లో తమ అభిప్రాయాలను బాహాటంగానే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకటి రెండు సార్లు చంద్రబాబు సైతం తన అభిప్రాయాలు తెలిపారు. అయితే తాజాగా బాబు మరో కీలక అడుగు వేశారు.
సుమారు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో గవర్నర్ నరసింహన్ ను రీకాల్ చేయాలని కోరుతూ రెండు రోజుల్లో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని మంత్రులకు చంద్రబాబు హితబోధ చేశారని సమాచారం. ఉమ్మడి రాజధానిలోని పరిణామాలపై తామెంతగా విన్నవించిన గవర్నర్ స్పందిచడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలకు గవర్నర్ బాధ్యుడనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ను రీకాల్ చేయాలని కోరుతూ సికింద్రాబాద్ లో విడిదిలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సారథ్యంలో సాగిన ఏపీ క్యాబినెట్ తీర్మానించింది.
అయితే చంద్రబాబు నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గవర్నర్‌ను తప్పించేందుకే సీనియర్ రాజకీయవేత్త, దేశరాజకీయాల్లో ప్రత్యేకత కలిగి ఉన్న చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం సరికాదేమోనని పేర్కొంటున్నారు. పరిస్థితులను కేంద్రానికి విన్నవిస్తే వారే నిర్ణయం తీసుకునేవారేమోనని, తద్వారా చంద్రబాబు ఆలోచన ఫలించే అవకాశం ఉండేది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు.
గవర్నర్ నరసింహన్ పై ఏపీ మంత్రులు విమర్శలు చేస్తే ఆ వైఖరి మార్చుకోవాలలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే.