Begin typing your search above and press return to search.
మంత్రులకు మునిసిపల్ కష్టాలు..!
By: Tupaki Desk | 11 July 2016 10:46 AM GMTచంద్రబాబు కేబినెట్‌లో ప్రస్తుతమున్న మంత్రులు - రేపో మాపో జరగబోయే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా కేబినెట్ లోకి చేరాలనుకుంటున్న ఆశావహులకు ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. తమ మంత్రి పదవులు నిలవాలన్నా.. తమను మంత్రులుగా తీసుకోవాలన్నా.. తమ అధినేత చంద్రబాబు పెడుతున్న పరీక్షలో నెగ్గి తీరాల్సి వస్తోందని వారు తెగ ఫీలైపోతున్నారట! ఇంతకీ ఆ పరీక్ష ఏంటంటే.. రాష్ట్రంలోని 11 మునిసిపాలిటీలు సహా మరో రెండు కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందే రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని సీఎం భావించారు. అయితే, ఇంతలో మునిసిపల్ ఎన్నికల విషయం గుర్తుకొచ్చి.. ఆ విషయాన్ని వాయిదా వేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. గత కొంతకాంగా పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ఊహాగానాలు వెలువడుతున్నా, చంద్రబాబు దీనిపై స్పందించడం లేదు.
అయితే కేబినెట్ లో కొన్ని పదవులు ఖాళీగానే వుండిపోయాయి. చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు మంత్రివర్గం ఏర్పాటు సమయంలో వివిధ సమీకరణాల వల్ల అవకాశం కల్పించలేకపోయారు. అలాంటి వారంతా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ రెండేళ్ల కాలంలో కొంతమంది మంత్రులు పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటివారికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికి సీనియర్లు - సమర్థులైన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయకుండా మునిసిపల్ ఎన్నికల తర్వాత చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో రాష్ట్ర మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు బాధ పట్టుకుంది. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకోలేక పోతే.. పదవులకు గండం వస్తుందని ప్రస్తుతమున్న మంత్రులు, తమ ఆశలపై నీళ్లు జల్లుతారని ఆశావహులు కుమిలిపోతున్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎంతమందిని గెలిపించారు, ఎన్ని ఓట్లు వేయించగలిగారనే దానిని బట్టి వారి పనితీరుపై ముఖ్యమంత్రి ఒక అంచనాకు వస్తారని సమాచారం. దీంతో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరి బాటలోనే మంత్రులూ నడుస్తున్నారు. మరి సీఎం చంద్రబాబా మజాకా..!