Begin typing your search above and press return to search.
బాబు కేబినెట్ విస్తరణ.. ఆ ఇద్దరూ ఎవరు?
By: Tupaki Desk | 4 Sept 2018 10:30 AM ISTఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే తాను మంత్రివర్గ విస్తరణను చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లేందుకు తహతహలాడుతున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కసరత్తును భారీగా చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాబు తీరు మాత్రం భిన్నంగా ఉంది. తనకున్న ఎనిమిది నెలల పదవీ కాలాన్ని వదులుకోవటానికి బాబు ఏ మాత్రం సిద్ధంగా లేరు.
ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్న వేళ.. ముందస్తుకు వెళితే జరిగే నష్టం ఏమిటో బాబుకు బాగా తెలుసు. అందుకే ఆయన.. తనకున్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు ఆయన ఏ మాత్రం ఇష్టపడటం లేదు. అదే సమయంలో. ఈ స్వల్ప వ్యవధిలో తన ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే అంశాల మీదా దృష్టి సారించారు.
వరుసగా సభల్ని నిర్వహిస్తున్న చంద్రబాబు దృష్టి తాజాగా మంత్రివర్గ విస్తరణపై పడింది. మోడీతో నెలకొన్న పంచాయితీతో ఎన్డీయేకు రాం రాం చెప్పిన చంద్రబాబు నిర్ణయంతో బీజేపీకి కేటాయించిన మంత్రులు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో.. ఏర్పడిన ఖాళీల భర్తీపై తాజాగా ఆయన దృష్టి సారించారు.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ఖాళీగా ఉన్న రెండు పదవుల్ని త్వరలో భర్తీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఆ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని.. కానీ తన బావమరిది హరికృష్ణ మరణం కారణంగా వాయిదా వేసినట్లుగా వెల్లడించారు. బీజేపీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి చాలాకాలమే అయినా.. ఇప్పుడు వీరిద్దరి స్థానంలో మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన వెనుక కారణం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న వేళ.. అందుకు తగ్గట్లు తనకు కొన్ని వర్గాల మీద ఉన్న ప్రేమాభిమానాల్ని ప్రదర్శించాలన్న తాపత్రయం బాబులో కనిపిస్తుందని చెప్పాలి. త్వరలో కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఒక పదవిని మైనార్టీలకు బాబు ఇవ్వనున్నారు. మైనార్టీ మంత్రి స్థానాన్ని బాబు భర్తీ చేయని తెలిసిందే.
తాజా విస్తరణలో ఈ అవకాశాన్ని ఎమ్మెల్సీ మహ్మద్ షరీఫ్ కు దక్కనున్నట్లు చెబుతున్నారు. గుంటూరులో నిర్వహించిన మైనార్టీ సభలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఇక.. మరో మంత్రి పదవిని మహిళకు కేటాయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేబినెట్ లో చోటు కల్పించటం ద్వారా తనపై గుర్రుగా ఉన్న ఆ సామాజిక వర్గాన్ని కూల్ చేయాలన్నది బాబు ప్లాన్ గా చెబుతున్నారు.