Begin typing your search above and press return to search.
కేబినెట్ విస్తరణ.. బాబు మరో మోసం..
By: Tupaki Desk | 6 Oct 2018 11:38 AM GMTఏపీ సీఎం చంద్రబాబు మరో లీకులిచ్చారు. అదే మంత్రివర్గణ విస్తరణ అట.. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగా.. ఇప్పుడు కొత్తగా ఆయనకు మంత్రివర్గ విస్తరణ గుర్తుకు వచ్చిందని సమాచారం. కానీ అది ప్రేమతో వచ్చింది మాత్రం కాదు.. అవసరం కోసం వచ్చింది. ముస్లిం ఓటు బ్యాంకు కోసం వచ్చింది. అవును .. చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ముస్లింలకు ఓ మంత్రి పదవి ఇవ్వడానికి రెడీ అయ్యారట.. చంద్రబాబు 2014 ఎన్నికల్లో గద్దెనెక్కాక ఓ ముస్లిం నాయకుడికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ నెరవేరడం లేదు..
అవసరార్థం రాజకీయాలు చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీతో దోస్తీ చేసి ఎన్నికల్లో గెలిచిన మోడీ.. అప్పుడు మోడీ వ్యతిరేకించే ముస్లింలను దగ్గరకు రానీయలేదు. అందుకే ఆ మూడేళ్లు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలనే మాట కూడా ప్రస్తావించలేదు. ఇక మోడీతో విడాకులు కాగానే వెంటనే ముస్లిం నేతలతో మీటింగ్ పెట్టేసి ముస్లింలకు కేబినెట్లో చోటు అని ప్రకటించాడు.
అది ప్రకటించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ముస్లింలకు కేబినెట్లో చోటు దక్కలేదు. మొదట ముస్లిం నేత ఫరూక్ కే మంత్రి పదవి అని బాబు సెలవిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ముస్లింకి వ ఎమ్మెల్సీ పదవి అన్నారు. అనంతరం ఫరూక్ కు కేటాయించారు. నంద్యాలలో గెలిస్తే ముస్లింకి మండలి చైర్మన్ అని హామీ ఇచ్చారు. అది నెరవేరలేదు. ఇప్పుడు ఏకంగా ముస్లింలకు మంత్రి పదవి అంటూ మరో పల్లవి ఎత్తారు. ఇప్పుడూ టీడీపీ అధినేత చాయిస్ ఫరుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఫరూక్ కు మంత్రి పదవి ఇచ్చింది లేదు.. వచ్చింది లేదు..
ఇప్పుడు కొత్తగా మరో హామీ ఇచ్చాడు. మావోయిస్టుల చేతిలో చనిపోయిన కిడారి సర్వేశ్వరరావు కొడుక్కి మంత్రి పదవి అన్నాడు. దాని కోసం కేబినెట్ విస్తరణ చేస్తారట.. అదీ నవంబర్ లో.. కానీ కిడారి కొడుక్కి మంత్రి పదవి రావాలంటే అతడు మొదట మంత్రి అయ్యాక ఆరు నెలల లోపే ఎన్నికవ్వాలి.. కానీ వచ్చే ఏప్రిల్ లోనే ఎన్నికల నగారా మోగుతుంది. దాన్ని బట్టి ఆరునెలల సమయం లేదు. దీంతో కిడారి కొడుక్కి మంత్రి పదవి ఆశ కూడా నెరవేరేలా కనిపించడం లేదు. దీన్ని బట్టి చంద్రబాబు మంత్రి పదవుల ఆశ చూపి అందరినీ బురిడీ కొట్టించాడని అర్థమవుతోంది. అటు ఫరూక్ కు - ఇటు కిడారి కొడుక్కి.. ముస్లింలకు మంత్రి పదవి ఆశ చూపాడు.. ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. మరి ఈ వాయిదాల పర్వానికి అంతమెప్పుడో వేచి చూడాలి..