Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బకు..బాబు ప్రెస్ మీట్ రద్దైపోయిందే
By: Tupaki Desk | 17 March 2020 5:30 PM GMTప్రాణాంతక వైరస్ కరోనా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకూ పాకిపోయిన కరోనా... ఆయా దేశాలను ప్రజలతో పాటు రాజకీయ నేతలను కూడా తీవ్రంగా భయపెట్టోస్తోంది. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఇందుకు అతీతులేమీ కాదని తేలిపోయింది. కరోనా దెబ్బకు జడిసిపోయిన చంద్రబాబు... కరోనాకు తాను ఎంతగా భయపడుతున్నానన్న విషయాన్ని మంగళవారం బయటపెట్టేసుకున్నారు. రోజూ నిర్వహిస్తున్న మాదిరే మంగళవారం కూడా మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించిన చంద్రబాబు.. కరోనా నేపథ్యంలో దానిని రద్దు చేసుకున్నట్లుగా సంచలన ప్రకటన విడుదల చేశారు.
అధికారంలో ఉన్నా... విపక్షంలో ఉన్నా నిత్యం ప్రజలతో మమేకమయ్యే విధంగా తన షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటున్న చంద్రబాబు... మిగిలిన నేతల కంటే అధికంగా మీడియా సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగిస్తున్న పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న చంద్రబాబు... నిత్యం ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ.. జగన్ వైఖరిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు దాదాపుగా ప్రతి రోజూ మీడియా సమావేశాలను నిర్వహిస్తూనే ఉన్నారు.
ఇదే క్రమంలో మంగళవారం కూడా తాను మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టుగా మంగళవారం ఉదయమే మీడియా ప్రతినిధులకు సమాచారం పంపారు. అయితే మధ్యాహ్నం తర్వాత సదరు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా చంద్రబాబు సంచలన ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం చేరిపోయింది. చంద్రబాబు మీడియా సమావేశాన్ని కరోనా వైరస్ నేపథ్యంలోనే రద్దు చేస్తున్నట్లుగా కూడా సదరు ప్రకటనలో టీడీపీ పేర్కొంది. దీంతో కరోనా అంటే తాను కూడా భయపడుతున్నట్లుగా చంద్రబాబు చెప్పకనే చెప్పినట్టైందన్న వాదన వినిపిస్తోంది.