Begin typing your search above and press return to search.
అమరావతిలో ఫస్ట్ టైం రాష్ర్టపతి ఎన్నిక..
By: Tupaki Desk | 17 July 2017 6:15 AM GMTకొత్త రాష్ర్టపతిని ఎన్నుకునే ప్రక్రియ మొదలైపోయింది. దేశ ప్రథమ పౌరుడు ఎవరు అవుతారన్నది దాదాపుగా తేలిపోయినా కూడా దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి మాత్రం నెలకొంది.
కాగా తొలిసారి నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు - స్పీకర్ కోడెల శివప్రసాదరావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును చంద్రబాబు వేయగా, రెండో ఓటును స్పీకర్ వేశారు.
కాగా ఏపీ శాసనసభ ఆవరణలోని కమిటీ హాలులో జరుగుతున్న ఈ పోలింగ్ లో పలువురు ఎమ్మెల్యేలు - తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియతో అసెంబ్లీ ఆవరణలో సందడి ఏర్పడింది.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలో ఓటేయనున్న ఎమ్మెల్యేలు - ఎంపీలకు ఈసీ ప్రత్యేకంగా రూపొందించిన మార్కర్ పెన్నులను అందించింది. ఓటు వేయడానికి వచ్చేవారు వ్యక్తిగతంగా పెన్నులు తెచ్చుకోవడాన్ని ఈసీ నిషేధించింది. ఈ సీ అందించిన సీరియల్ నంబర్లతో కూడిన పెన్నులతోనే ఓటే వేయాల్సి ఉంటుంది.