Begin typing your search above and press return to search.
మెమరీ లాస్ చంద్రబాబు!
By: Tupaki Desk | 16 March 2018 4:45 PM GMT‘చంద్రబాబునాయుడు కు మెమరీ లాస్ ఉన్నదా? ఎప్పుడూ అలా కనిపించరే.. ఆరోగ్యంగానే ఉంటారే?? మరి రాజకీయ అంశాలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం మెమరీ లాస్ ఉన్నదేమో అనే భ్రమ మనకు కలిగేలాగా.. ఆయన మాట్లాడుతుంటారెందుకు’’ అని తెలుగు ప్రజలు ఇప్పుడు నివ్వెరపోతున్నారంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే చంద్రబాబునాయుడు నిన్న చెప్పిన విషయానికీ, ఇవాళ చెప్పిన విషయానికీ ఈ మధ్య కాలంలో అసలు పొంతనే ఉండడం లేదు. అందుకే జనం ఆయనకు మెమరీ లాస్ వచ్చిందేమో అనుకుంటున్నారు.
ఇలాంటి ఆరోపణ చేయగానే.. అందరూ ప్రత్యేకహోదా విషయంలో ఆయన ఇప్పటికి పలుమార్లు యూటర్న్ లు, ఎస్ టర్న్ లు, హెయిర్ పిన్ బెండ్ లు, ఎక్స్- టర్న్ లు ఇలా ఇంగ్లిషు భాషలో ఉండగల రకరకాల టర్నులన్నీ తీసుకున్న సంగతి అందరికీ తెలుసు. దాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోదా విషయంలో ఎన్నిసార్లు ఎన్నెన్ని రకాలుగా మాటమార్చారనేది కొత్త సంగతి కాదు.
కాకపోతే.. తాజాగా.. అన్ని విషయాల్లోనూ మాట మారుస్తున్నారు. సారీ, అలా అనడం కంటె.. ఇదివరకు చెప్పిన విషయాన్ని మరచిపోయి.. దానితో సంబంధం లేని కొత్త సంగతి చెబుతున్నారని అంటే బాగుంటుంది. పవన్ కల్యాణ్, నరేంద్రమోడీలు మహానుభావులు అని మొన్నటి దాకా అన్నారు. ఇవాళ ఆ ఇద్దరి వల్ల రాష్ట్రంలో తనకు ఒక్క ఓటు కూడా రాలేదని అంటున్నారు.
సాయం విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నదని కొన్ని వందల సార్లు అన్నారు.. ఇప్పుడు తొలినుంచి ద్రోహచింతనే, నమ్మకద్రోహమే ఉన్నదని అంటున్నారు.
అవిశ్వాసం దండగ.. యూజ్ లెస్ అన్నారు... వైకాపా తీర్మానం పెడితే మేం మద్దతివ్వాలూ అంటూ హూంకరించారు.. ఆ సంగతి మర్చిపోయి.. మద్దతిస్తాం అన్నారు. తెల్లారే సరికి ఆ సంగతి కూడా మర్చిపోయి.. మేమే అవిశ్వాసం పెడతాం అంటున్నారు. పెట్టేశారు.
దేశంలో చాలా పార్టీల్తో మాట్లాడుతున్నారు.. అని పార్టీనేతలతో చెప్పారు. ప్రకటించారు. మోడీ సర్కారు భరతం పడతా అన్నారు. తీరా అవిశ్వాసం పెట్టేశాక.. నేను ఏ ఒక్క నాయకుడితోనూ మాట్లాడలేదు అంటున్నారు. ఈ మాటలన్నీ ఆయన మరచిపోయి అంటున్నట్లే అనుకోవాలి. అందుకే .. ఆయనకు మెమరీ లాస్ ఉన్నదేమో అనిపిస్తోంది.
అయినా.. చైనీస్ లో ఒక సామెత ఉంది. దాని ఇంగ్లిషు భావం ఇదీ.
‘‘ ది ఎడ్వాంటేజీ ఆఫ్ ట్రూత్ ఈజ్ ... యూ నీడ్ నాట్ టు రిమెంబర్ వాటెవర్ యూ సెడ్’’ అని!
నిజం చెబితే గుర్తుంచుకునే పన్లేదు. అబద్ధాలు చెప్పేవాళ్లు మాత్రమే.. ప్రతిసారీ మాట మారుస్తూ పాపం.. నానా యాతన పడుతుంటారు. చంద్రబాబుకు అబద్ధాల వల్లనే మెమరీ లాస్ వచ్చిందన అంతా నవ్వుకుంటున్నారు.