Begin typing your search above and press return to search.
తూగోలో సిట్టింగులకే మెజారిటీ సీట్లు
By: Tupaki Desk | 2 March 2019 6:21 AM GMTరోజువారీ భేటీలతో ఒక్కో జిల్లాను - పార్లమెంట్ స్థానాన్ని కంప్లీట్ చేస్తున్నారు చంద్రబాబు. అయితే.. తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్థుల్ని మాత్రం కాస్త ఆచి తూచి సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీకి బంపర్ మెజారిటీ తెచ్చింది ఈ రెండు జిల్లాలే. అందుకే ఏ చిన్న అసమ్మతి వచ్చినా ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టేస్తున్నారు. అసమ్మతి లేని స్థానాల్ని కన్ ఫర్మ్ చేసి చంద్రబాబు ప్రకటించారు.
అందరూ ఊహిస్తున్నట్లుగానే కాకినాడ ఎంపీ స్థానాన్ని చలమలశెట్టి సునీల్ కే కేటాయించారు చంద్రబాబు. ఈ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు తోట నరసింహం. తోట.. వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. అదీగాక.. ఆయన తన భార్య కోసం జగ్గంపేట ఎమ్మెల్యే స్థానాన్ని అడిగారు. చంద్రబాబు కుదరదని చెప్పడంతో పాటు.. జగ్గంపేట స్థానాన్ని జ్యోతుల నెహ్రూకి ఇచ్చేశారు. ఇటు ఎంపీ సీటు - ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో.. తోట నరసింహం వైసీపీలోకి వెళ్లడం అధికారికంగా కన్‌ఫర్మ్ అయినట్లే. ఇక కాకినాడ రూరల్ స్థానాన్ని పిల్లి అనంతలక్ష్మికి కేటాయించారు. పెద్దాపురం నుంచి చినరాజప్ప - తుని నుంచి యనమల కృష్ణుడు బరిలోకి దిగుతున్నారు. పిఠాపుం స్థానాన్ని పెండింగ్ లో పెట్టిన చంద్రబాబు.. పత్తిపాడు టిక్కెట్ ను వరుపుల రాజాకు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు.