Begin typing your search above and press return to search.
చంద్రబాబు సన్నిహితుడికి ఏపీ ప్రభుత్వంలో కీలక పోస్ట్?
By: Tupaki Desk | 2 Aug 2019 5:00 AM GMTగత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు అత్యంత ఆప్తులుగా చలామణి అయిన వారు, ఆయన ప్రైవేట్ కార్యక్రమాలను కూడా తమ హోదాలతో చేసి పెట్టిన వారు కొందరు ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పాగా వేస్తున్నారనే మాట వినిపిస్తూ ఉంది.
ఇప్పటికే మంత్రుల పేషీల్లో చాలామంది తెలుగుదేశం నాటి వాళ్లే చక్రం తిప్పుతూ ఉన్నారు. వారిని సాగనంపాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించినా కొందరు మంత్రులు వారినే కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి వారి వల్ల జగన్ ప్రభుత్వానికి ఇబ్బందే అనే ప్రచారం ఉంది.
ఇలాంటి నేపథ్యంలో మరిన్ని విచిత్రాలు కూడా చోటు చేసుకుంటున్నాయని సమాచారం.అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సన్నిహిత పోలీసు అధికారికి ఒకటి కాదు రెండు కీలక పదవులు దక్కనున్నాయట.
ఆయన చంద్రబాబుకు కు చాలా సన్నిహితుడు. పోలిస్ శాఖలో కీలక పదవులు నిర్వహించారు.జగన్ పై కేసులను డ్రాఫ్ట్ కాకుండా చేసింది ఆయనే అంటారు. అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేయడం వంటి కార్యక్రమాలకు కూడా పాల్పడింది ఆయనే అని తెలుస్తోంది.
ఇలాంటి క్రమంలో జగన్ వచ్చాకా అలాంటి వారికి ప్రాధాన్యత దక్కకుండా పోతుందని అంతా అనుకుంటారు. అయితే సదరు చంద్రబాబు సన్నిహితుడు ఇప్పుడు వేరే రకంగా ముందుకు వెళ్తున్నాడట. రాయలసీమకు చెందిన ఒక మంత్రిని పట్టుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పోస్టింగులు సంపాదిస్తూ ఉన్నాడని సమాచారం.
ఒకేసారి రెండు పోస్టులను అతడు సొంతం చేసుకుంటున్నాడని సమాచారం. అలాంటి వ్యక్తికి ఆ పదవులు కేటాయించడం ద్వారా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు పొరపాటు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. కీలకమైన పోస్టులను చంద్రబాబుకు సన్నిహితుడైన అధికారికి ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్షియల్ విషయాలు లీక్ అయ్యే అవకాశాలున్నాయని ఆ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెబుతున్నారు. మరి ఈ విషయంలో జగన్ ప్రభుత్వం అలర్ట్ అవుతుందో కాదో!