Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఎట్టకేలకు కదులుతున్నాడు
By: Tupaki Desk | 1 Sep 2020 5:33 PM GMTకరోనా దాడి మొదలైనప్పటి నుంచి ఆరు నెలలుగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. మధ్యలో ఒకసారి విశాఖపట్నం ప్రమాదం జరిగినపుడు ఆయన ఏపీకి వెళ్లారు. ఆ సందర్భంగా కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దానికి, ముందు తర్వాత చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏపీ అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా ఆ పార్టీ నేతలు పలువురు ఎంతగా విమర్శించినా, ఎద్దేవా చేసినా చంద్రబాబు హైదరాబాద్ వీడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి వెళ్లడం.. అక్కడ తిరగడం తనకు, ప్రజలకు ఇద్దరికీ మంచిది కాదు అనే ఉద్దేశంతో ఆయన భాగ్యనగరానికి పరిమితం అయిపోయారు. ఐతే లాక్ డౌన్ షరతులన్నీ ఎత్తేశాక కూడా బాబు హైదరాబాద్ వీడకపోవడం, ఏపీ వైపు చూడకపోవడం ఒకింత విమర్శలకు గురైంది.
పార్టీ కార్యకలాపాలన్నింటినీ చంద్రబాబు ఆన్ లైన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. మహానాడు సైతం జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక జనాలకు ఏమైనా చెప్పాలనుకున్నపుడు వీడియో సందేశాలు ఇచ్చారు. ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు. ఐతే కరోనా మొదలై ఆరు నెలలు దాటిపోయాక కూడా ఇంకా హైదరాబాద్‌లో ఉండటం సరికాదని ఆయన ఏపీకి పయనం కావాలని నిర్ణయించుకున్నారు. బుధవారమే ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరుతున్నట్లు సమాచారం. వెంటనే జనాల్లోకి వెళ్లే అవకాశం లేదు కానీ.. పార్టీ నాయకులతో సమావేశాలు మాత్రం నిర్వహించబోతున్నారు. ముందు తాను విజయవాడకు వచ్చి.. పరాయి రాష్ట్రంలో ఉంటున్నాడన్న విమర్శలకు తెరదించాలని బాబు భావిస్తున్నారు. కరోనా ప్రభావాన్ని అనుసరించి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వంపై పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.