Begin typing your search above and press return to search.
ఏపీ బీజేపీ నేతలకు బాబు పంచ్!
By: Tupaki Desk | 27 Feb 2019 6:03 AM GMTఏ మాటకు ఆ మాటే చెప్పాలి. దేశంలో మరే పార్టీ అధినేత మీద లేనన్ని విమర్శలు.. ఎటకారాలు ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు మీద వినిపిస్తూ ఉంటాయి. ఆయనపై విమర్శలు చేయటం ఎంతో ఈజీగా చెబుతారు. ప్రతి అంశంలోనూ ఆయన్ను తప్పు పట్టేందుకు వీలుగా బాబు ఇప్పటికే పలుమార్లు తప్పులు చేయటం.. వ్యవస్థల్ని ధ్వంసం చేసిన విషయంలోనూ.. మాయోపాయాల్ని.. కుట్రల్ని.. కుతంత్రాల్ని సెట్ చేయటంలో బాబు రికార్డును ఎవరూ బీట్ చేయలేరని చెబుతారు.
దీనికి సంబంధించిన అంశాలెన్నో చరిత్రలో చక్కగానే నిక్షిప్తం చేశారు.ఏపీలో కులతత్త్వం అంతకంతకూ పెరిగిపోవటానికి.. రాజకీయాల్లో పారిశ్రామికవేత్తలు.. సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోవటానికి బాబే కారణంగా చెప్పాలి. ఇలాంటి బాబు మీద విమర్శనాస్త్రాల్ని సంధించటంలో ఎవరికి వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు.
మోడీతో బాబుకు చెడిన తర్వాత నుంచి ఏపీ కమలనాథులు ప్రతి చిన్న విషయానికి కస్సుమంటున్నారు. ఆ మాటకు వస్తే.. మోడీతో స్నేహం ఉన్న సమయంలోనూ కొద్దిమంది బీజేపీ నేతలు బాబుపై తరచూ పరోక్ష వ్యాఖ్యలు.. విమర్శలు చేసే వారు. ఇలా ఎప్పటికప్పుడు విమర్శలతో చికాకు పెడుతున్న బీజేపీ నేతలపై తాజాగా బాబు విసిరిన పంచ్ ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రప్రభుత్వం వివిద రంగాల్లో సాధించిన పురోగతిని కేంద్రం గుర్తిస్తోందని.. అందుకు నిదర్శనంగానే రాష్ట్రానికి పలు అవార్డులు వస్తున్నాయని బాబు వ్యాఖ్యానించారు. ఓపక్క కేంద్రం రాష్ట్ర పని తీరును గుర్తించి అవార్డులు ఇస్తుంటే.. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
తమ పాలనకు నిదర్శనంగా గడిచిన నాలుగున్నరేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి 700 అవార్డులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం కూడా జలవనరుల శాఖకు ఏడు.. వైద్య శాఖకు మరో ఏడు అవార్డులు వచ్చాయని.. మరి దేనికి విమర్శిస్తారంటూ ప్రశ్నించిన బాబు తీరు బీజేపీ నేతలకు ఇబ్బంది కలగటం ఖాయం.