Begin typing your search above and press return to search.

బాబు గారి మాట : హైకోర్టు విభ‌జ‌న జ‌గ‌న్ కోస‌మేన‌ట‌

By:  Tupaki Desk   |   28 Dec 2018 1:48 PM GMT
బాబు గారి మాట : హైకోర్టు విభ‌జ‌న జ‌గ‌న్ కోస‌మేన‌ట‌
X
సందర్భం ఏదైనా....అవ‌కాశం దొరికితే చాలు...ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పై మండిప‌డ‌టం అల‌వాటే. ఎన్నిక‌లు స‌మీపిస్తుంటే...స‌హ‌జంగా ఈ విమ‌ర్శ‌లు మ‌రింత పెరుగుతాయి. తాజాగా అలాంటి సంచ‌ల‌న‌మైన, చిత్ర‌మైన విమ‌ర్శ‌ను చంద్ర‌బాబు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు వెనుక కుట్ర ఉంద‌ని ఆయ‌న సెల‌విచ్చారు. వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న బాబు డిసెంబర్ 28వ తేదీ శుక్రవారం కూడా ఆరో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ కేసుల్లో జాప్యం కోస‌మే ఈ విభ‌జ‌న అని నొక్కి వ‌క్కాణించారు.

ఉమ్మడిగా కొనసాగుతున్న హైకోర్టును కేంద్రం విభజించి న్యాయమూర్తులు..న్యాయవాదులను కేటాయించింది. దీనిపై సీఎం చంద్రబాబునాయుడు రాజ‌కీయ కోణంలో స్పందించారు. హడావుడిగా హైకోర్టును విభజించారని..ఇందుకు తగిన సమయం కూడా ఇవ్వలేదని బాబు వాపోయారు. హైకోర్టు విభజనపై తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని...జనవరి 1వ తేదీలోపు పనులు చేపట్టాలని ఆదేశించడం ఏమిట‌ని ఆయన తప్పుబట్టారు. ఇంత త్వరగా చేయాల్సింది ఏముంది అని ప్రశ్నించారు. కేవలం వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ఉన్న కేసులను జాప్యం చేయడానికి..కాలయాపన చేయడానికే విభజించారని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుగుతూ..తీరా ఓ కొలిక్కి వచ్చే సమయానికి హైకోర్టును విభజించారని విమర్శించారు.

అయితే, చంద్ర‌బాబు చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ నుండే పరిపాలించే వీలున్నా బాబు విజయవాడకు వెళ్లిపోయారని, అమరావతిలోనే అసెంబ్లీ..సెక్రటేరియట్ కట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు. హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసి భవనం నిర్మాణం తొందరగా కంప్లీట్ చేయాల‌ని ఆదేశించినా కూడా...మూడేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన సీఎం చంద్ర‌బాబు హ‌డావుడిగా విభ‌జించారంటూ వ్యాఖ్యానించడం చిత్రంగా ఉదంటున్నారు.