Begin typing your search above and press return to search.

గంటలు కొద్దీ మదించి బాబు చెప్పిందిదే..

By:  Tupaki Desk   |   31 July 2016 11:00 AM GMT
గంటలు కొద్దీ మదించి బాబు చెప్పిందిదే..
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై తెలుగుదేశం పార్టీ పార్ల మెంటరీ సమావేశంలో గంటల కొద్దీ మేధోమధనం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ చేశారు. తన తీరుకు తగ్గట్లే కేంద్రం తీరును తప్పు పడుతూనే.. తమ డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోని మోడీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మళ్లీ బంతిని మోడీ కోర్టులో వేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే..

= అరుణ్ జైట్లీ మాటలు బాధాకరం. రెండేళ్లు చేస్తారన్న ఆశతో ఉన్నాం. ప్రధాని రెండు గంటలు ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

= అరుణ్ జైట్లీ మాట్లాడిన విధానం చూస్తే.. రెండేళ్ల తర్వాత ఆయనిప్పుడు ఇలా మాట్లాడతారా?

= ఫ్రెండ్లీస్టేట్ కాబట్టి ఎక్కువ చేయలేం. నిధులు లేవు కాబట్టి ఎక్కువ చేయలేమని చెప్పటం సరికాదు.

= ఫైనాన్స్ కమిటీ పేరు చెప్పి కాదనటం ఏమిటి?

= ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు పదేళ్లు అని బీజేపీ వాళ్లు అడిగారు

= ఐదేళ్లు అని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు

= ఎక్కడా 14 ఆర్థిక సంఘానికి..ప్రత్యేక హోదాకు ఏ మాత్రం సంబంధం లేదు

= ఫైనాన్స్ కమిషన్ ను మేం విమర్శించాం

= ఇది మనకు జీవన్మరణ సమస్య. సీరియస్ గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది.

= దేశంలో ఏ రాష్ట్రానికి లేనన్ని సమస్యలు ఏపీకి ఉన్నాయి.

= కష్టాల్లో ఉన్నప్పుడు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కష్టాలు ఉండేవి మొదట్లోనే ఉంది. మ్యాన్ హోల్డింగ్ అన్నారు.. అదెప్పుడు ఇవ్వాలి?

= ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి. జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

= ఆ రోజు ఓటర్లు కేంద్రానికి.. రాష్ట్రానికి ఓటేశారు.

= వనరులు లేకుంటే విభజన ఎందుకు చేశారు? విభజనకు ఎందుకు ఒప్పుకున్నారు?

= మెజార్టీ రాజకీయ పార్టీలు.. స్పెషల్ స్టేటస్ కానీ.. విభజన బిల్లులో పెట్టిన అంశాల్ని అమలు చేయమని చెప్పారు

= ఇంతకు మించిన ఎండార్స్ మెంట్ ఇంకేం కావాలి?

= ఇది 5 కోట్ల జనాభాకు సంబంధించిన సమస్య ఇది. మొదటి ఏడాది రాస్ట్ర ఆర్థికలోటును భర్తీ చేయలేదు

= రెండురాష్ట్రాలు ఒప్పుకున్న ఎమ్మెల్యే సీట్ల పెంపు కూడా పెండింగ్ పెట్టారు.

= రాష్ట్రాల ఆదాయం పెరిగిందని చెబుతున్నారు. ఈరోజు కేంద్రం ఆదాయం కూడా పెరిగింది.

= ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా మీద పోరాడుతున్న పార్టీలన్నింటికి ఒకటే వినతి చేస్తున్నాం.

= ప్రధానిని అపాయింట్ మెంట్ అడుగుతున్నాం. విభజన మీద జరిగిన అన్యాయం.. హోదా అంశం దృష్టికి తీసుకెళతాం.

= అరకొరడబ్బులు ఇచ్చిన విషయాన్ని.. అన్ని అంశాల్ని మోడీ దృష్టికి తీసుకెళ్లి.. ఆయన స్పందనను అనుసరించి నిర్ణయం తీసుకుంటాం.

= విభజన జరిగినప్పటి నుంచి ఈదేశంలో మేమేం తప్పు చేశామన్న బాధ అందరిలో ఒక అవగాహన ఉంది.

= బంద్ లు.. నిరసనలు చేస్తూ ఆస్తుల్ని నష్టపర్చుకుంటామా?

= కేంద్రం అంటే అన్ని రాష్ట్రాల కలయికే కేంద్రం.

= మద్రాసు నుంచి కర్నూలు వెళ్లాం. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాం. ఎన్ని ఇబ్బందులు పడ్డామో అన్ని ఇబ్బందులు పడ్డాం.

= కట్టుబట్టలతో కర్నూలు వచ్చాం. ఈ రోజు హైదరాబాద్ నుంచి నెత్తిన అప్పులు పెట్టుకొని వచ్చాం.

= ప్రజలు కోరుకోలేదు..దేశంలో ఈ తరహా విభజన ఎప్పుడూ జరగలేదు.

= వారు కోరుకొని వెళ్లారు. మనం.. వద్దనుకున్నా విడిపోవాల్సి వచ్చింద.

= ఆదాయం లేదు.. పరిశ్రమలు.. రాజధాని లేదు. సంస్థలు లేవు. నా రాజకీయ అనుభవంతో విన్నవించుకుంటున్నా. అన్నిరాజకీయ పార్టీలకు బాధ్యత ఉంది.

= బాధ్యత లేకుండా ప్రవర్తించిన కాంగ్రెస్ ను పనిష్ చేశారు. బీజేపీని నమ్మి ప్రజలు ఓట్లేశారు. బాధ్యత నుంచి తప్పించుకోలేదు.

= అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లటం వల్ల లాభం ఏమిటి? మన రాష్ట్రంలో మూడు.. నాలుగు పార్టీలు ఉన్నాయి. కానీ.. రాజ్యసభలో అన్ని పార్టీల వారు ప్రయత్నించారు. ఢిల్లీకి నలుగురైదుగురు వెళ్లే కన్నా.. ఎవరికి వాళ్లు ప్రయత్నాలు చేయాలి.

= మిత్రపక్షంగా మా ధర్మం మేం చేస్తూ.. మేం చేయాల్సింది చేస్తాం.

= అన్ని పార్టీలకు విన్నవిస్తున్నా.. మీరు పోరాడండి. కానీ.. ప్రజలకు అసౌకరర్యం కలిగించకండి.

= ఈడీ.. సీబీఐ కేసులు ఉన్న వ్యక్తి.. నాపై కేసులు పెడతారని భయపడుతున్నానని చెబుతున్నాడు.

= వాళ్లకు రాజకీయ అవగాహన లేదు. పేపరు ఉంది.. టీవీ ఉంది.. అదే పనిగా రాయటం.. చూపించటం.. తప్పుడు రాతలు రాయటం

= ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది.. ఇలాంటి వారిని దూరంగా పెట్టాల్సింది ఉంది.

= నిన్న పెట్టిన ప్రెస్ మీట్.. చేసిన ఆరోపణలన్నీ నా మీద పెట్టిందే. బంద్ ప్రకటన కూడా నన్ను ఉద్దేశించిందే. ఉన్మాదంతో వ్యవహరించే ఇలాంటి పార్టీలు అవసరమా అని ప్రజలు ఆలోచించాలి.

= నాకిక్కడ చాలా పని ఉంది. వీటిని వదిలిపెట్టి ఢిల్లీకి ఎందుకు వెళ్లటం. మా ఎంపీలు ఉన్నారు. వారు ప్రధానిని కలుస్తారు.