Begin typing your search above and press return to search.
ట్రంప్ భార్యల లెక్క చెప్పిన చంద్రబాబు
By: Tupaki Desk | 12 Oct 2016 7:23 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు కాస్త భిన్నం. ఆయన ఏ విషయం మీదనైనా మాట్లాడేస్తారు. నీతులు చెప్పే ప్రోగ్రాం తరచూ పెట్టే చంద్రబాబు.. అదే ఊపులో పలు విమర్శలు చేసేస్తుంటారు. అక్కడెక్కడో ఉన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ మీద తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు. కుటుంబ విలువల గురించి చెప్పే క్రమంలో ట్రంప్ భార్యల ముచ్చటను చంద్రబాబు ప్రస్తావించటం గమనార్హం. తాజాగా ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎంవో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబ విలువల గురించి.. ఏపీ ప్రభుత్వ పని తీరు గురించిన ముచ్చట్లతో పాటు పలు అంశాల్ని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ భార్యల భాగోతాన్ని ప్రస్తావించటం గమనార్హం. భారత దేశంలో ఉన్నన్ని విలువలు ప్రపంచంలో మరెక్కడా లేవని చెప్పిన చంద్రబాబు.. అమెరికాలో ఎన్నెన్నో పెళ్లిళ్లు చేసుకుంటారన్నది చూస్తున్నదేనన్న ఆయన.. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్ కు ఇప్పుడున్న ఆవిడ నాలుగో భార్య అనుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. అన్ని పెళ్లిళ్లు చేసుకోవటం తాత్కాలిక ఎంజాయ్ మెంట్ గా అభివర్ణించిన చంద్రబాబు.. మన ఆనందానికి కారణంగా కుటుంబ బంధంగా చెప్పుకొన్నారు.
ట్రంప్ మాటలు చూస్తుంటే అగ్రదేశమైన అమెరికాలో కూడా నాయకత్వ లేమి ఉన్నట్లుగా ఉందన్నారు. మనం సమిష్టి కుటుంబంలో ఉంటున్నామని.. ఇప్పుడు కొన్ని మార్పులు వస్తున్నాయని.. అలా మారకూడదన్నారు. ఏసీ రూంలో పని చేసుకున్న తర్వాత కూడా ఇంటికి వెళ్లి గడపాలే కానీ.. రోబోలతో ఆడుకోకూడదని వ్యాఖ్యానించారు. ఇంటి పనుల కోసం ఆడ రోబోలను తయారు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన..పెరుగుతున్న సాంకేతికతపై సుదీర్ఘంగా మాట్లాడారు. డబ్బులుంటే సమాజం గౌరవిస్తుందని అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారని.. డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చని అనుకుంటున్నారని.. మనిషిలో స్వార్థం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా.. ఎన్నో విషయాల మీద చంద్రబాబు చెప్పిన మాటలు వింటుంటే.. కొన్ని ప్రశ్నలు మనసులో తళుక్కున మెరవటం ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/