Begin typing your search above and press return to search.
శీలం గురించి కామెంట్లు..మరో వివాదంలో బాబు
By: Tupaki Desk | 27 April 2017 1:42 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పురాణాల్లో ఆరాధ్యదేవతగా నిలిచిన సీతాదేవీశీలం గురించి ప్రస్తావిస్తూ పొలిక పెట్టి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే దేశం...ఒకే సారి ఎన్నికలు అనే ప్రతిపాదన తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ప్రతిపాదన గురించి చంద్రబాబు ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం స్వాగతిస్తానని అన్నారు. అయితే అదే సమయంలో నోరు జారారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి సీతాదేవి శీలాన్ని పరీక్షించిన మాదిరిగా ఏదో రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు నిర్వహించడం ఏంటంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. విపక్షాలు సహా ఆధ్యాత్మికవాదులు బాబు కామెంట్లపై మండిపడుతున్నారు. గతంలోను చంద్రబాబు ఇలా వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మురికివాడలో ఉన్న స్కూళ్లలో చదివితే మురికి ఆలోచనలే వస్తాయంటూ పేదలను అగౌరవపరిచేలా గతంలో వ్యాఖ్యలు చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు? అంటూ అట్టడుగు వర్గాల వారిని తీవ్రంగా అవమానించే వ్యాఖ్యలు చేశారు. మరో సందర్భంలో కోడలు మగబిడ్డను కంటానంటే అత్త మాత్రం ఎందుకు వద్దంటుంది? అని వ్యాఖ్యానించడం ద్వారా వివాదంలో చిక్కారు. ఇదే రీతిలో తాజాగా మరోసారి చంద్రబాబు నోరు జారారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/