Begin typing your search above and press return to search.
జగన్ లండన్ టూర్ మీద ఆ మాటలేంది బాబు?
By: Tupaki Desk | 23 Feb 2019 9:29 AM GMTరాజకీయాల్లో నిజాయితీని ఆశించటం నేతి బీరలో నేతిని చూపించమనటమే. కాకుంటే.. అంతో ఇంతో ఇంగితంతో వ్యవహరించటం అవసరం. అది కూడా లేకుండా పోతున్న ఇప్పటి రాజకీయాల్ని చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకునే పరిస్థితి. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు కురిపించటం.. ఆరోపణలు చేయటం మామూలే అయినా.. తాజాగా ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిది రాజకీయ కోణంలో చూడటం.. ప్రతి దానికి విపరీతార్థాలు వెతకటం లాంటివి సరికావంటున్నారు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె లండన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
సుదీర్ఘకాలం పాటు సాగిన పాదయాత్ర నేపథ్యంలో ఆమెను కలిసింది లేదు. దానికి తోడు.. ఎన్నికల నగారా ఒకసారి మోగితే.. మళ్లీ నాలుగైదు నెలల పాటు కలిసే అవకాశం ఉండదు. ఇలాంటి వేళ.. కుమార్తెను చూడటానికి లండన్ కు వెళ్లాలనుకోవటం ఏ మాత్రం తప్పు కాదు. కానీ.. జగన్ లండన్ పర్యటనను తప్పుదారి పట్టించేలా.. దానికి లేనిపోని అంశాలతో జత చేర్చటం ద్వారా రాజకీయ లబ్థి పొందాలని బాబు ప్రయత్నించటం సరికాదంటున్నారు.
చేసే ఆరోపణల్లో పస ఉండాలే తప్పించి.. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా చేయటం ద్వారా లాభం తర్వాత నష్టం పక్కా అని చెప్పక తప్పదు. జగన్ కుమార్తె లండన్ లో చదువుతుందన్న విషయం అందరికి తెలిసినప్పుడు దానికి డబ్బుల సంచులు తెచ్చుకోవటానికే వెళ్లినట్లుగా ఆరోపించటం వల్ల లాభం ఏమైనా ఉందా? అన్నది ప్రశ్న. నిజానికి జగన్ తో పోలిస్తే చంద్రబాబు ఫ్యామిలీ కానీ.. బాబు కానీ తరచూ విదేశాలకు వెళుతుంటారు. మరి.. ఆయన అలా వెళ్లిన ప్రతిసారి డబ్బుల సంచుల కోసమని ఆరోపిస్తే ఎలా ఉంటుంది? సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఆచితూచి అన్నట్లుగా ఉండాలే తప్పించి చిల్లరగా అస్సలు ఉండకూడదు.
గతంలో పరిమితమైన మీడియా ఉన్నప్పుడు కొన్ని నడిచిపోయాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి విషయం బయటకు వచ్చే పరిస్థితి. ఇలాంటప్పుడు లేని దాన్ని ఉందని భ్రమించేలా చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. ఈ తరహా విమర్శలు చేయాలని చెప్పే సలహాదారుల్ని బాబు దూరంగా ఉంచితే మంచిదన్న సూచనలు కొందరు చేస్తున్నారు. బాబుగారు.. వింటున్నారా?