Begin typing your search above and press return to search.

బాబు బాట‌లోకి వెళ్ల‌కుంటే ఇంత బుర‌ద‌జ‌ల్లుడా?

By:  Tupaki Desk   |   1 Aug 2018 6:35 AM GMT
బాబు బాట‌లోకి వెళ్ల‌కుంటే ఇంత బుర‌ద‌జ‌ల్లుడా?
X
ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పాలి. నీతిగా ఉండాలి. నిజాయితీగా వ్య‌వ‌హ‌రించాలి. చేసేదే చెప్పాలి. చెప్పిందే చేయాలి. మాట త‌ప్ప‌టం అన్న‌ది ఉండ‌కూడ‌దు. అధికారం కోసం నోటికి వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇచ్చేసి.. మ‌భ్య పెట్టి.. మ‌ళ్లీ వాటిని ప్ర‌జ‌లు మ‌ర్చిపోయేలా చేయ‌టం కోసం కిందా మీదా ప‌డ‌టం లాంటివి న‌చ్చ‌ని ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొద‌ట్నించి ఒకే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇచ్చిన చంద్ర‌బాబు.. అధికారంలోకి రావ‌టం నిజ‌మే అయినా.. నాలుగున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో ఆయ‌న ఇచ్చిన హామీల్లో ఎన్ని అమ‌లు చేశారో చూస్తే.. ఆయ‌న మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఇట్టే తెలిసిపోతుంది. బాబు బాట‌లో న‌డ‌వ‌టం ఏ మాత్రం ఇష్టం లేని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. తాను చేయ‌గ‌లిగిందే చేస్తాన‌ని చెప్ప‌టం మొద‌ట్నించి ఉన్న‌దే.

నిజం నిష్ఠూరంగా ఉన్నా.. దాని వ‌ల్ల కాస్త ఇబ్బంది అనిపించినా.. దీర్ఘ‌కాలంలో న‌మ్మ‌కున్న ప్ర‌జ‌ల‌కు మోసం చేయ‌లేద‌న్న సంతృప్తి ఉంటుంది. కానీ.. ఇలాంటి విలువ‌లు చంద్ర‌బాబు లాంటి నేత నుంచి ఆశించ‌టం అత్యాశే అవుతుంది. అధికార‌మే త‌ప్పించి ఇంకేమీ అక్క‌ర్లేద‌న్న‌ట్లుగా ఉండే ఆయ‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆంధ్రోళ్ల‌కు భ‌విష్య‌త్తు మీద కొత్త ఆశ‌ల్ని క‌ల్పిస్తున్నారు.

అయితే.. జ‌గ‌న్ ముక్కుసూటిత‌నాన్ని ఎంతకైనా డ్యామేజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్న ప‌చ్చ బ్యాచ్‌.. జ‌గ‌న్ మాట‌ల్ని పీకి.. పీకి.. యాగీ చేసే ప్ర‌య‌త్నాల్ని చేస్తున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల మీద జ‌గ‌న్ చెప్పిన మాట‌లు అక్ష‌ర స‌త్యాలు. ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకోవ‌టానికి ఏవో మాట‌లు చెప్ప‌ట‌మే త‌ప్పించి.. వాస్త‌వంలో అవి అమ‌లు కావ‌టం సాధ్య‌మే కాదు.

కానీ.. ఆ విష‌యాన్ని క‌ప్పి పుచ్చుకొని రాజ‌కీయం చేసే చంద్ర‌బాబు తీరును త‌ప్పు ప‌ట్టే జ‌గ‌న్‌.. తాను ఆ దారిలో న‌డ‌వ‌కుండా అద్యంతం జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఈ నేప‌థ్యంలో కాపు రిజ‌ర్వేష‌న్ల మీద వాస్త‌వం మాట్లాడిన జ‌గ‌న్ ను బ‌ద్నాం చేయ‌టానికి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. ఇదంతా చూస్తున్న‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. రాజ‌కీయాల్లో బాబు మాదిరి దొంగ మాట‌ల‌తో కాల‌క్షేపం చేయ‌టం.. అర‌చేతిలో స్వ‌ర్గం చూపించి అధికారాన్ని సొంతం చేసుకొని.. ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోకుండా ఉండ‌టం.

ఇదే త‌ర‌హా రాజ‌కీయాల్నిప్ర‌ద‌ర్శించి. . ప్ర‌ద‌ర్శించి న‌మ్మిన ప్ర‌జ‌ల్ని ముంచేసిన చంద్ర‌బాబు తీరులో జ‌గ‌న్ లాంటి యువ‌నేతలు ఎట్టి ప‌రిస్థితుల్లో న‌డ‌వ‌కూడ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. కాపు రిజ‌ర్వేష‌న్ల పై బాబు ఉన్న వాస్త‌వాన్ని చెప్పార‌ని.. అదే చేస్తే.. త‌మ పీఠాలు క‌దిలిపోతాయ‌న్న ఉద్దేశంతో యాగీ చేస్తున్న తెలుగు త‌మ్ముళ్ల‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాపు రిజ‌ర్వేష‌న్ల మీద జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తున్న తెలుగు త‌మ్ముళ్లు.. తాము అధికారంలోకి వ‌చ్చిన నాలుగున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీని ఇంత‌వ‌ర‌కూ ఎందుకు అమ‌లు చేయ‌న‌ట్లు? నిజానికి కాపు రిజ‌ర్వేష‌న్ల మీద కాపులు సైతం అనుకూలంగా లేర‌న్న మాట వినిపిస్తోంది. రిజ‌ర్వేష‌న్ల కంటే.. కాపు వ‌ర్గ అభివృద్ధి కోసం ప్ర‌త్యామ్న‌యం చూస్తే చాల‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. జ‌గ‌న్ మాట‌లే కాపుల భ‌విత‌కు అండ‌గా నిలుస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.