Begin typing your search above and press return to search.
కర్ణాటకకు కోపం వచ్చే మాటెందుకు బాబు?
By: Tupaki Desk | 16 Sep 2016 7:41 AM GMTవ్యాఖ్యలు చేయటం తప్పేం కాదు. కానీ.. దాని వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉండాలే కానీ లేనిపోని తలనొప్పులు ఉండకూడదు. ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్లుగా చంద్రబాబు చేసిన ఒక వ్యాఖ్యను పలువురు తప్పు పడుతున్నారు. ఏదో చెప్పబోయి ఏదో చెప్పినట్లుగా బాబు తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఆచితూచి మాట్లాడాల్సిన సమయంలో మనసులు నొచ్చుకోకుండా ఉండటం మంచిది. అందులోకి తమకే మాత్రం సంబంధం లేని విషయాల్లో తల దూర్చటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. కానీ.. ఆ విషయంలో చంద్రబాబు తప్పు చేసినట్లుగా చెబుతున్నారు.
కావేరీ నదీ జలాల అంశంలో తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల మధ్య నడుస్తున్న లొల్లి తెలిసిందే. ఈ వివాదం మీద సుప్రీం ఆదేశాల్ని కాదంటూ కన్నడిగులు చెలరేగిపోవటం.. ఇందుకు ప్రతిగా తమిళనాడులో కొన్ని ఘటనలు చోటు చేసుకోవటం తెలిసిందే. అన్ని కలిపి రెండు రాష్ట్రాల్ని కాల్చేసినంత పని చేశాయి.రెండు రాష్ట్రాల మధ్య నడిచిన నీటి వివాదం హద్దులు దాటి రెండు రాష్ట్రాల్లోని ఐటీ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేయటమే కాదు.. ఇప్పటివరకూ వారికున్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది.
ఇవన్నీ నిజాలే అయినప్పటికీ.. కొంతమంది నోటి నుంచి రావటం ఏ మాత్రం బాగోదు. అత్త తిట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు నొచ్చుకున్న చందంగా ఉంటాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు కూడా ఇదే రీతిలో ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జలవివాదాల గురించి తాజాగా మాట్లాడిన చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.అదెలానంటే.. కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల మధ్య 14 టీఎంసీల కోసం ఘర్షణలు చెలరేగిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. ఈగొడవల కారణంగా బెంగళూరు ప్రతిష్ట మసకబారిపోయిందని వ్యాఖ్యానించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
గొడవలు జరిగింది రెండు రాష్ట్రాల్లో అయినా బెంగళూరును ప్రస్తావించటం కర్ణాటక రాష్ట్రం నొచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికి జరిగిన డ్యామేజ్ తోనే కిందామీదా పడుతున్న వేళ.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తమ పేరును ప్రస్తావించి డ్యామేజ్ జరిగిపోయిందంటూ వ్యాఖ్యలు చేయటం వల్ల ఎంతోకొంత నష్టం పెరుగుతుందే తప్పించి తగ్గదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పాజిటివ్ ఉంటే ఆ విషయాన్ని ప్రస్తావించటం వల్ల ఎంతోకొంత ఉపయోగం ఉంటుంది కానీ ఇలా నెగిటివ్ మాటల కారణంగా నష్టం వాటిల్లడంతో పాటు.. తమ ఇమేజ్ ను అదును చూసి దెబ్బ తీశారన్న భావన కలిగే వీలుంది. ఐటీలో బెంగళూరుతో పోటీ పడే హైదరాబాద్ మహానగరం సొంతమైన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ పంచాయితీ గురించి తల దూర్చలేదు సరికదా.. తనకు సంబంధమే లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. అలా ఉండాల్సిన చంద్రబాబు.. ఏదో పెద్ద మనిషిగా మాట్లాడే క్రమంలో చేసే వ్యాఖ్యలు ఆ రాష్ట్రాన్ని.. అక్కడి ప్రజల్ని గాయపరిచే వీలుందని హెచ్చరిస్తున్నారు. మరిలాంటి జాగ్రత్తల్ని బాబు ఎందుకు మిస్ అవుతున్నారో..?