Begin typing your search above and press return to search.
బ్రిటీష్.. నిజాం.. మోడీ.. ఒక్కరేనా బాబు?
By: Tupaki Desk | 1 April 2018 1:23 PM GMTబాబు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు. సాహసోపేతమైన నిర్ణయాలకు దూరం. తొందరపడి ఒక మాట అనటానికి ఇష్టపడరు. మాటల్లో కఠినమున్నా.. పదాల ఎంపికలో ఆచితూచి అన్నట్లుగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి చాలానే విశ్లేషణలు చేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు బాబు ఇప్పుడు. తనపై ఉన్న ముద్రలు తప్పన్నట్లుగా ఆయన తీరు ఉంది. మోడీ విషయంలో ఆయన అన్ని అడ్డంకుల్ని దాటేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా.. ఇప్పటివరకూ ఎవరి విషయంలోనూ దాటని హద్దుల్ని బాబు ఇప్పడు దాటేస్తున్నారు.
మోడీ లాంటోడ్ని ఢీ కొనేందుకు కిందా మీదా పడుతూ.. తొందరపడితే ముఖం పచ్చడి అవుతుందన్న హెచ్చరికల్ని బాబు పెద్దగా పట్టించుకోవటం లేదు. హోదా విషయంలో ఏపీని మోసం చేశారన్న మాటను కొద్ది రోజులుగా అదే పనిగా చెబుతున్న బాబు.. ఇప్పుడు ట్రాక్ మార్చారు. మాటల తీవ్రతను పెంచేశారు. నిన్నటివరకూ స్నేహితుడన్న విషయాన్ని వదిలేసి మరీ.. తీవ్ర వ్యాఖ్యలే చేస్తున్నారు.
తాజాగా లేపాక్షి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీపై బాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. నిజంగానే ఆయన నోట్లో నుంచే అంతటి మాటలు వచ్చాయా? అన్న భావన కలిగేలా చేస్తున్నాయి. బ్రిటీష్.. నిజాంలతో మోడీని పోల్చటం సంచలనం కాక మరేమిటి? నాడు బ్రిటిష్ వారిపై పోరాటం చేశామని.. నిజాంపైనా పోరాటం చేశామని.. ఇప్పుడు మోడీపై పోరాటం చేసేందుకు సిద్ధమని బాబు ప్రకటించటం చూస్తే.. రానున్న రోజుల్లో మోడీపై మాటల యుద్ధం మరెంత ముదురుతుందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హోదా నినాదాన్ని బాబు ఎత్తుకోవటానికి ముందు వరకూ ఇదే మోడీ సర్కారు నిధులు ఇస్తోందని.. తమకు సహకరిస్తుందని చెప్పిన బాబు.. ఇప్పుడు ఏకంగా బ్రిటీష్.. నిజాంలతో పోల్చటం గమనార్హం. ఏపీకి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని చెబుతున్న చంద్రబాబు.. తనపై ఢిల్లీ వారికి కోసం ఉన్నా వదిలిపెట్టనని చెప్పారు.
తమకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాలని కేంద్రానికి చెబితే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తోందని ఫైర్ అయిన ఆయన.. ఏపీకి అన్యాయం చేసిన మోడీపై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. తాను పుట్టిన గడ్డ కోసం పోరాటం చేస్తున్నానని.. జన్మభూమి కోసం తాను పోరాటం చేస్తున్నట్లు చెబుతున్నారు. మోడీనే ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తున్న చంద్రబాబు పవన్ ను సైతం వదిలిపెట్టలేదు. మొన్నటికి మొన్న హాడావుడి చేసి.. ఇప్పుడేం చేస్తున్నావ్? హామీలు నిలబెట్టుకోకున్నా.. జన్మభూమిపై అభిమానం ఉన్న వారు ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ పవన్ పై విసుర్లు విసిరిన బాబు తీరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో తన మాటల యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్న సంకేతాల్ని ఇచ్చేసినట్లుగా చెప్పాలి.
అంతా బాగుంది కానీ.. బాబు నోటి నుంచి ఇంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నట్లు? అన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి. బాబును ఇరుకున పెట్టేందుకు.. బాబు సర్కారు అవినీతిని ఫ్రూవ్ చేసే పనిగా మోడీ ఉన్నారని.. అవన్నీ లెక్కలు వచ్చాక చర్యలు షురూ చేస్తే.. అదంతా తాను మోడీపై విమర్శలు చేసినందుకే తనపై కేసుల దాడి చేస్తున్నారన్న వాదనకే ఇంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. బ్రిటీష్.. నిజాంలతో మోడీని పోల్చటం చూస్తే.. బాబు ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం కాక మానదు.