Begin typing your search above and press return to search.

పార్టీ ఓట‌మిని బంధువుల మ‌ర‌ణంతో పోల్చిన బాబు!

By:  Tupaki Desk   |   4 July 2019 10:21 AM IST
పార్టీ ఓట‌మిని బంధువుల మ‌ర‌ణంతో పోల్చిన బాబు!
X
ఓట‌మి ఆలోచ‌నాశ‌క్తిని త‌గ్గిస్తుందంటారు. నిరాశ‌..నిస్పృహ‌లో కూరుకుపోయిన‌ప్పుడు యాక్టివ్ గా ఉండ‌లేరంటారు. ఇలాంటి వేళ‌లో త‌ర‌చూ త‌ప్పులు చేస్తుంటారు. తాజాగా ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబును చూస్తే.. ఇది నిజ‌మ‌నిపించ‌క మాన‌దు. షాకింగ్ ఓట‌మిని సొంతం చేసుకున్న ఆయ‌న‌.. ఫ‌లితం వెలువ‌డిన నెల‌న్న‌ర త‌ర్వాత కూడా ఇంకా అందులో నుంచి బ‌య‌ట‌కు రాలేద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

తాజాగా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు.. కొన్ని సంద‌ర్భాల్లో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఏ మాత్రం లాజిక్ లేని వ్యాఖ్య‌లు కొన్ని ఆయ‌న నోటి నుంచి వ‌చ్చాయి. ఓట‌మిని అధిగ‌మించేందుకు ఆయ‌న మాన‌సికంగా సిద్దంగా లేర‌న్న విష‌యాన్ని తాజాగా చేసిన మాట‌ల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.

ఓట‌మి విజ‌యానికి తొలిమెట్టుగా భావించే వారి ఆలోచ‌న ఒక‌లా ఉంటుంది. అందుకు భిన్న‌మైన ఆలోచ‌న‌లు ఉన్న వారి తీరు మ‌రోలా ఉంటుంది. బాబును.. తాజాగా ఆయ‌న చెబుతున్న‌ మాట‌ల్ని చూసిన‌ప్పుడు ఇదెంత నిజ‌మ‌న్న‌ది ఇట్టే అర్థం కాక మాన‌దు. క‌ల‌లో కూడా ఊహించ‌ని షాకింగ్ ఓట‌మి ఎదురైన‌ప్పుడు.. దానికి కార‌ణ‌మేంది? తాము గొప్ప‌గా పాలించిన‌ట్లుగా ఫీలైన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లంత దారుణంగా ఎందుకు ఓడించార‌న్న విష‌యంపై బాబుకు క్లారిటీ రాలేద‌న్న విష‌యం ఆయ‌న మాట‌ల్ని వింటే అర్థం కాక మాన‌దు.

అలాంట‌ప్పుడు ఓట‌మి మీద పూర్తిస్థాయి అవ‌గాహ‌న‌.. విశ్లేష‌ణ వ‌చ్చే వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాకుండా ఉంటే కొంప‌లేమీ మునగ‌వు క‌దా? అందుకు భిన్నంగా పోలోమ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చేసి.. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేస్తే న‌ష్టం బాబుకే కానీ మ‌రెవ‌రికీ కాద‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తిస్తే మంచిది. తాజాగా కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం చెప్పే క్ర‌మంలో ఆయ‌న పోలిక ఒక‌టి ఎంత ద‌రిద్రంగా ఉందో చెప్ప‌లేని ప‌రిస్థితి.

పార్టీ ఓట‌మిని బంధువుల మ‌ర‌ణంతో పోల్చేసిన వైనం ఏ మాత్రం అత‌క‌ని రీతిలో ఉంద‌ని చెప్పాలి. బంధువులు ఎవ‌రైనా చ‌నిపోతే.. కొద్దిరోజులు బాధ‌ప‌డి కాల‌క్ర‌మంలో మ‌రిచిపోతాం.. టీడీపీ ఓట‌మిని కూడా అలాగే మ‌రిచిపొండి. ఎన్నిక‌ల్లో ఓడిపోయినందుకు అధైర్య‌ప‌డ‌టం నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం కాదు.. నిజ‌మైన కార్య‌క‌ర్త‌లు.. నాయ‌కులు క‌ష్టాల్లో అండ‌గా నిల‌వాల‌ని ఆశించారు. విజేత ఎప్పుడు ఓట‌మిని మ‌ర్చిపోడు. అనుక్ష‌ణం దానిని గుర్తు పెట్టుకొని.. ఆ ఓట‌మి స‌మ‌యంలో తాను చేసిన త‌ప్పుల్ని మ‌రోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాడు. అందుకు భిన్నంగా బంధువుల మ‌ర‌ణం.. పార్టీ ఓట‌మి ఒకే గాటున క‌ట్టేస్తూ.. ఏ మాత్రం సింక్ కాని మాట‌ల్ని స్ఫూర్తివాచ‌కాలుగా చెప్ప‌టంలో అర్థం లేద‌న్న విష‌యం బాబుగారు ఎప్ప‌టికి గుర్తిస్తారో?