Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బ్లడ్: బాబుది 30 టు 100%

By:  Tupaki Desk   |   13 Feb 2019 11:53 AM GMT
కాంగ్రెస్ బ్లడ్: బాబుది 30 టు 100%
X
చంద్రబాబుకు ఏదైనా సాధ్యమే.. ఎన్ని రంగులు మార్చినా ఓకే.. ఊసరవెళ్లి రంగులు మార్చినట్టు బాబు గారు కూడా అవసరార్థం అనుకూల పార్టీలవైపు మరులుతున్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అవసరార్థం వాడుకోవడంలో అవసరం తీరాక నాయకులను వదిలించుకునే విషయంలో మన బాబుగారు పీహెచ్ డీ చేశారని రాజకీయల్లో చర్చ జరుగుతుంటుంది. తాజా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

నిన్నటి ఢిల్లీ ధర్నాలో చంద్రబాబు ఒక హాట్ కామెంట్ చేశారు. అదేంటంటే.. ‘తాను కాంగ్రెస్ లోనే రాజకీయం మొదలు పెట్టానని చెప్పాడు. ఇప్పుడు టీడీపీలో ఉన్నా.. తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ అని.. అందుకే ఈ దఫా ఆ పార్టీతో కలిసి నడుస్తున్నానని’ చెప్పుకొచ్చారు. ఇన్నాల్లు 30శాతం కాంగ్రెస్ బ్లడ్ తనలో ఉండేదని.. 70 శాతం టీడీపీది ఉండేదన్నారు. కానీ ఇప్పుడు 100శాతం కాంగ్రెస్ బ్లడ్ గా పొత్తుతో అయిపోయిందన్నట్టు బాబు ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించినట్టైంది.

బాబు గారు 2014లో కూడా మోడీతో పొత్తు విషయంలో ఇలానే చెప్పుకొచ్చారు. వాజ్ పేయి హయాంలో ఎన్డీఏను నిలబెట్టింది తానేనని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తానేనని గొప్పలకు పోయారు. ఇప్పుడు బీజేపీ-మోడీ బ్యాచ్ మోసం చేసేసరికి ప్లేట్ ఫిరాయించి కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ అవసరాల కోసం దేనితోనైనా కలిసే చంద్రబాబు ఒకవేళ ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ లో కలిసిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. ఎంతైనా రాజకీయాల్లో అధికారం కోసం బాబు ఎంతకైనా దిగజారుతారని చాలా ఉదాహరణలు వల్లవేస్తున్నారు. చూడా మరి మన బాబు గారు 100శాతం కాంగ్రెస్ మనిషిగా ఎప్పుడు మారుతారో..