Begin typing your search above and press return to search.

బాబు గారి 1500 రోజుల క‌థ‌!

By:  Tupaki Desk   |   17 July 2018 5:23 AM GMT
బాబు గారి 1500 రోజుల క‌థ‌!
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టి 1500 రోజులైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ " అవునా... ఇన్ని రోజులైందా... నాకు 15 రోజులు అయినట్లుగా ఉంది " అని వ్యాఖ్యానించారు. నిజమే... ప్రజల గురించి... సంక్షేమం గురించి... అభివ్రద్ధి గురించి ఆలోచిస్తే అన్ని రోజులూ గుర్తుంటాయి. కేవలం డబ్బు, అధికారం... దోచిన దాన్ని దాచుకోవడం వంటి అంశాలే గురించే ఆలోచిస్తే ఎన్ని రోజులైనా గుర్తుండవని ప్ర‌తిప‌క్షాలు బాబు గాలి తీశాయి. నిజానికి ఈ పదిహేను వందల రోజుల్లో నారా వారు ఆంధ్రప్రదేశ్‌ లో గడిపింది ఎన్ని రోజులో లెక్క తీస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ఆయన రాష్ట్రంలో కంటే ఇతర రాష్ట్రాల్లోనూ, దేశ రాజధానిలోనూ, విదేశాల్లోనూ గడిపిన రోజులే ఎక్కువ.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరగని దేశం లేదు. తన వందిమాగదులను వెంట తీసుకుని లండన్ - దావోస్ - సింగపూర్ - దుబాయ్ - మలేషియా - జపాన్ - జర్మనీ ఇలా చాలా దేశాలు కలియ‌తిరిగారు. ఈ ప్రయాణాలన్నింటికి కలిపి... అక్కడ బస చేసిన రోజులూ లెక్కలు తీస్తే ఆయన పాలనలో కనీసం సగం రోజులు అంటే 750 రోజులు దీనికే సరిపోతుంది. ఇక రాష్ట్రం వెలుపల అంటే వివిధ రాష్ట్రాల్లోనూ, దేశ రాజధాని ఢిల్లీలోనూ కలిపి ఆయన గడిపింది అథమపక్షం 250 రోజులు ఉంటుంది. అంటే ఏలిన వారు స్వరాష్ట్రంలో కంటే ఇతర చోట్లే దాదాపు 1000 రోజులు గడిపేశారు.

మిగిలిన 500 రోజులు ఆయన పాలన కంటే కూడా తనకు, తమ్ముళ్లకు ఎలాంటి " మేళ్లు " జరగాలో ఆలోచించారు. ఇక గడచిన మూడు నాలుగు నెలలుగా ప్రత్యేక హోదా సాధన పేరుతో చేస్తున్న ధర్మ పోరాట దీక్షలు, ఇతర కార్యక్రమాలకే సరిపోయింది. ఇక ఇందులో ప్రజలకు పనికి వచ్చే పని ఏదైనా ఉంది లెక్కలు తీస్తే... అది శూన్యంగానే కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడికి తనకు ఈ 1500 రోజులూ కేవలం 15 రోజులుగానే కనిపిస్తోంది. ఆయన్ని అధికారంలో కూర్చోపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఈ 1500 రోజులూ 1500 సంవత్సరాల నరకంగా తోస్తోంది. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు అవును నిజం..అవును నిజం... చంద్రబాబూ నివన్నది నిజం... నిజం...!!