Begin typing your search above and press return to search.
ఏపీ ఖర్మ : మళ్లీ అదే తప్పు జరుగుతోంది!
By: Tupaki Desk | 7 Sep 2016 4:06 AM GMTఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు పాలకులు మొత్తం హైదరాబాదు నగరం మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ అభివృద్ధి పనులు చేపడుతూ వచ్చారు. సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు వంటి వారు.. అనేక విషయంలో హైదరాబాదులో నగరంలోనే అభివృద్ధి పనులు - నిధులు మొత్తం కుమ్మరించేశారు. పర్యవసానంగా రాష్ట్ర విభజన సమయంలో చాలా పెద్ద రభస అయిపోయింది. హైదరాబాదులో వాటా కావాల్సిందేనంటూ సీమాంధ్రులు గొడవ చేయడం మనం చూశాం. పాలకులు ముందుచూపు లేకుండా కేంద్రీకృత అభివృద్ధి చేపడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని అప్పట్లో అంతా అనుకున్నారు. ఈ పాపం చంద్రబాబుదే అని కూడా అందరూ నిందించారు.
ఇప్పుడు మళ్లీ అదే తప్పు జరుగుతోంది. చంద్రబాబునాయుడు ఒకవైపు అభివృద్ధిని మొత్తం అమరావతి పేరుతో.. విజయవాడ గుంటూరుల మధ్యలోనే కేంద్రీకరించేస్తున్నారు. కనీసం ఇతరత్రా కొన్ని అయినా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయనుకుంటే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ ఇవ్వడానికి కూడా అభ్యంతరాలు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశాఖను రైల్వేజోన్ చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయిట. అదే సమయంలో విజయవాడ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వడానికైతే అభ్యంతరాలు లేవని.. కేంద్రం ఇవాళ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఏపీ చేసుకున్న ఖర్మ ఏమిటోగానీ.. కనీసం రైల్వేజోన్ వచ్చి ఏదైనా విస్తరణకు - కొత్త ఉపాధుల కల్పనకు అవకాశం ఏర్పడితే.. బాగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అది దన్నుగా నిలుస్తుందని అనుకుంటే.. చివరికి దాన్ని కూడా మొత్తం అభివృద్ధిని కేంద్రీకరిస్తున్న విజయవాడకే తరలించే ప్రయత్నం చాలా ఘోరంగా ఉంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సందర్భాల్లో పట్టు విడవకుండా, రాష్ట్రమంతా వికేంద్రీకృత అభివృద్ధి జరిగేలా సాధించుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ముందుచూపుతో వ్యవహరించకపోతే.. భవిష్యత్తులో మళ్లీ కొత్త ఉద్యమాలకు - అసంతృప్తుల పోరాటాలకు బీజం వేసినట్లు అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.