Begin typing your search above and press return to search.
దీపావళి తర్వాత బాబు ఇంకో పాచిక వేస్తారట
By: Tupaki Desk | 28 Sep 2017 10:33 AM GMTతెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాత ఫార్ములాతో కొత్త యుద్ధానికి సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఎజెండాలో దూకుడుగా సాగుతున్న బాబు దీపావళి తర్వాత మరో ఎన్నిక బరిలో దిగనున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక, ఆ తర్వాత జరిగిన కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార తెలుగుదేశం పార్టీ ఇదే ఊపును కొనసాగించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు జరిపేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఈ ఎన్నికలో గెలుపొందేందుకు కావాల్సిన అధికార - రాజకీయ - వ్యూహాలను బాబు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కాకినాడ తరహాలోనే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలకు జిల్లాకు చెందిన నేతలతోపాటు కనీసం ఆరేడు మంది మంత్రులను - 20 మందికిపైగా ఎమ్మెల్యే లను ప్రచారం నిమిత్తం పంపించాలని సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ ఛార్జిలుగా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ముఖ్య నేతలను నియమించిన చంద్రబాబు వారిని ఎన్నికల ప్రచారానికి పంపించేలా వ్యూహం రచిస్తున్నారు. ఇక గణాంకాల ప్రకారం చూస్తే...కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ఐదు లక్షల మంది ఉండగా, ఇందులో మూడు లక్షల మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఈ కార్పొరేషన్ పరిధిలో కర్నూలు - కోడూరు - పాణ్యం నియోజకవర్గాలు వస్తాయి. పాణ్యం మినహా మిగతా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాకు చెందిన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ - స్థానిక ఎమ్మెల్యే మోహన్ రెడ్డి - మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి - ఎమ్మెల్యే మణిగాంధీ వంటి సీనియర్ నేతలు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టు చెబుతున్నారు. విపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా అందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని కర్నూలు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్టు కూడా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే దీపావళి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కర్నూలు నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించక ఏడేళ్ళు పూర్తవుతోంది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేదని న్యాయస్థానాలు ఇప్పటికే తేల్చిచెప్పాయి. ఎన్నికలు జరుపుకోవచ్చని కోర్టులు పచ్చజెండా ఊపడంతో అధికార యంత్రాంగం ఇందుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ లోపు మరోమారు జిల్లా కేంద్రంలో పర్యటించాలని ఈ దఫా కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో ఆకస్మిక తనిఖీలు జరిపి నీటి పారుదల - మురుగునీరు - రహదారులు - వీధిలైట్ల పరిస్థితిపై సమీక్షించి అధికారులకు ఆదేశాలివ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే తెదేపాకు చెందిన ముఖ్య నేతలు జిల్లా కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించి అభ్యర్థుల ఎంపికపై ఒక విడత మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలన్న లక్ష్యంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పార్టీ శ్రేణులు దృష్టి సారించారని ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణకు పంపించినట్టు సమాచారం. మొత్తంగా అభివృద్ధి అనే ప్రచారంతో....పార్టీ నేతలతో జోరుగా పర్యటింపజేసి కర్నులు కోటపై టీడీపీ జెండా ఎగురవేయాలని బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.