Begin typing your search above and press return to search.
చంద్రబాబు నాయుడు.. వారికి పగ్గాలు వేసే ప్రయత్నం!
By: Tupaki Desk | 2 May 2019 2:30 PM GMTఒకవైపు ఎన్నికల ఫలితాలకు ఇంకా ఇరవై రోజులకు పై సమయం ఉన్నా ఇంతలోనే ఏపీలో రాజకీయ ఫిరాయింపులు జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చు అనే అంచనాల మధ్యన తెలుగుదేశం నుంచి పలువురు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా అలర్ట్ అవుతున్నారని సమాచారం. ఆ రకంగా చంద్రబాబు నాయుడు ప్రధానంగా రెండు పనులకు పూనుకుంటున్నారట. ఒకటి తమ పార్టీ విజయం సాధిస్తుందని పదే పదే చెప్పడం. పార్టీ ఓడిపోతోంది అనే భావనను నేతల్లో పోగొట్టడానికి బాబు గట్టి గా ప్రయత్నిస్తూ ఉన్నారు.
అందుకే ఆయన వరసగా టెలీ కాన్ఫరెన్స్ లు, సమీక్షలూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అని పోలింగ్ తర్వాత అభిప్రాయ బలంగా కలగడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడే. ఆయన పదే పదే ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడం, 'ఇవి ఎన్నికలే కాదు...' అని అనడంతో..చాలా మంది తెలుగుదేశం విజయం మీద అనుమానాలు కలిగాయి. ఆ పరిస్థితుల్లోనే కొంతమంది నేతలు తమ దారి తాము చూసుకునే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పార్టీ విజయం సాధిస్తుందని, వారి బ్రెయిన్ వాష్ కు దిగారని స్పష్టం అవుతోంది. ఇక రెండో అంశం.. పార్టీ నేతల మీద కూడా ఒకింత నిఘాను ఉంచడం. ఒకవేళ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో నేతల ఫిరాయింపులకు ఇప్పటి నుంచినే అడ్డుకట్టే వేసేందుకు తెలుగుదేశంపార్టీ అధినేత ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఎలాగూ త్రిముఖ పోరు లాంటి ఎన్నిక జరిగింది కాబట్టి.. హంగ్ వస్తుందేమో అనే అనుమానాలూ ఉన్నాయి!
ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇప్పటికే వైఎస్సార్సీపీలోకి టచ్లోకి వెళ్లిన వారు అప్పుడు అటు వైపు వెళ్లినా వెళ్లిపోగలరు. ఈ రోజుల్లో రాజకీయాలు పక్కా కమర్షియల్ గా మారాయి కాబట్టి ఆ మేరకు నేతలు ఏమైనా చేయగలరు. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రంగంలోకి దిగారని.. పార్టీ గెలుస్తుందని ఒకవైపు తమ పార్టీ నేతల బ్రెయిన్ వాష్ చేస్తూ మరోవైపు పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్న అభ్యర్థులకు పగ్గాలు వేసే ప్రయత్నాలను ఆయన ముమ్మరం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది!