Begin typing your search above and press return to search.

పైకి సరే...లోలోపల పోరే

By:  Tupaki Desk   |   22 Nov 2018 5:51 AM GMT
పైకి సరే...లోలోపల పోరే
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముంచుకొస్తోంది. అన్ని పార్టీల నుంచి రెబల్ అభ్యర్దులుగా నామినేషన్ వేసిన వారిని ఉపసంహరించేందుకు అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. బుజ్జగింపుల పర్వం వేడెక్కింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి రెబల్స్ పోరు తక్కువగానే ఉంది. అలాగే ఎన్నికల బరిలో ఉన్న వారిని తప్పించేందుకు తెలంగాన రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ఫలితాలు ఫలిస్తున్నాయి. మహాకూటమిలో మాత్రం రెబల్స్‌గా పోటి చేస్తున్న అభ్యర్దులు ఎవరి మాట వినే పరిస్దితిలో లేరు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న రెబల్స్‌ ను అధిష్టానమే బుజ్జగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ నాయకులందరూ ఏకంగా రెబల్స్ ఇంటికి వెళ్లి వారిని సముదాయిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రెబల్స్ గా పోటి చేస్తున్న వారందరిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే స్వయంగా బుజ్జగించడం గమనార్హం. మహాకూటిమి పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 13 నియోజకవర్గాల నుంచి పోటి చేస్తోంది. ఇందులో 5 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ రెబల్స్ పోటిలో ఉన్నారు. వీరిని బుజ్జగించేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగేరు. పార్టీలో ఏన్నాళ్ల నుంచో కష్టపడుతున్న తమకు గుర్తింపు లేకపోవడం వలన కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలోని రెబల్స్ నిప్పులు చెరుగుతున్నారు.

బుజ్జగింపులలో భాగంగా కొందరు నాయకులు మెత్తబడినట్లు చెప్తున్నారు. అయితే పరిస్దితి మాత్రం అందుకు విరుద్దంగా ఉందంటున్నారు. అధిష్టానం బుజ్జగింపులతో నామినేషన్ల ఉపసంహరణకు అంగీకరించిన రెబల్స్ చాప క్రింద నీరులా పార్టీలకి వ్యతిరేకంగా పనిచేస్తారని అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగాత తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు రాజకీయం కొత్త కాకపోవడంతో తమ నాయకుడు చంద్రబాబు చేసే రాజకీయాలనే తెలుగుదేశం రెబల్స్ కూడా ప్రయోగించనున్నట్లు సమాచారం. అద్రుష్టం కలసి మహాకూటమి అభ్యర్దులు గెలిస్తే రెబల్స్ చేసిన త్యాగానికి ఆయా పార్టీలలో గుర్తింపు ఉంటుంది. ఒక వేళ వెన్నుపోటు రాజకీయామే గెలిస్తే అధికారం తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులు విజయం సాధిస్తారు. అప్పుడు కూడా ఈ వెన్నుపోటు నాయకులకు కలసి వస్తుందని వారి అంచన. తమ కారణంగా అధికార పార్టీ అభ్యర్దులు గెలిస్తే తెలంగాణ రాష‌్ట్ర సమితి నుంచి మంచి గుర్తింపు ఉంటుందని రెబల్స్ భావిస్తున్నారు. ఈ ఎత్తుగడతో శుక్రవారం ఉదయం నుంచి తెలంగాణ ముందస్తు ఎన్నికల రాజకీయం మరింత రంజుగా మారనుంది.