Begin typing your search above and press return to search.
బాబు కాన్వాయ్ స్పీడుకి బలైపోయాడు
By: Tupaki Desk | 20 Feb 2016 5:00 AM GMTముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. అదే సమయంలో.. తాము ప్రయాణించే రహదారులకు తగ్గట్లే ముఖ్యమంత్రి కాన్వాయ్ స్పీడ్ ఉండాలన్న విషయాన్ని భద్రతా సిబ్బంది మర్చిపోకూడదు. అదే సమయంలో సీఎం కాన్వాయ్ వెళుతున్న ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది డేగ కళ్లతో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా జరిగే నష్టం భారీగా ఉంటుంది. అయితే.. సీఎం కాన్వాయ్ లోని అధికారులు.. పోలీసుల మధ్య సమన్వయం లోపం కారణంగా తాజాగా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఒక వ్యక్తి ప్రాణాలు పోయిన దుస్థితి.
ఏపీ తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన కోసం మూడు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఎంజీరోడ్డు నుంచి రాజగోపాలాచారి రోడ్డులో వెళుతున్న సీఎం బాబు కాన్వాయ్ వాహనం ఒకటి.. సైకిల్ మీద వెళుతున్న ఒక వ్యక్తిని బలంగా ఢీ కొట్టింది. దీంతో.. తీవ్రగాయాలు అయిన సదరు వ్యక్తి (పోస్టల్ అసిస్టెంట్ బి. నాగేంద్ర వరప్రసాద్)ని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా మరణించారు. ఈ సందర్భంగా పలువురు అధికారుల తప్పును ఎత్తి చూపిస్తూ విమర్శిస్తున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో విధులు నిర్వహించే పోలీస్ కానిస్టేబుళ్లు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెబుతున్నారు. సీఎం కాన్వాయ్ వెళుతున్న రోడ్లకు ఇరువైపు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మొహరిస్తారు. వారు కాన్వాయ్ వస్తున్న విషయాన్ని గుర్తించి.. రాకపోకల్ని అడ్డుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తుంటారు.
ఒకవేళ అలాంటి పరిస్థితే ఉండి ఉంటే.. సైకిల్ మీద వెళుతున్న పెద్ద మనిషిని అక్కడ భద్రత వ్యవహారాలు చూసే అధికారులు నిలువరించాల్సి ఉంది. సీఎం కాన్వాయ్ వెళుతున్న రహదారుల్లో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తుంటారు. మరి.. అలా చేసి ఉంటే.. ఈ ప్రమాదం జరిగి ఉండాల్సిన అవకాశమే ఉండదు. ఈ ఉదంతంలో సీఎం కాన్వాయ్ తప్పు కంటే కూడా.. కాన్వాయ్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవటంతో పాటు.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పోలీసులు ఈ ఉదంతానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం కాన్వాయ్ వెళుతుంటేనే.. రోడ్ల మీద ట్రాఫిక్ ను సరిగా నియంత్రించకపోవటాన్ని ఏమనాలి? ఇలాంటి నిర్లక్ష్యం.. బాబు పాలనలోనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.