Begin typing your search above and press return to search.
మోదీకి బాబు కౌంటర్!..ఏటీఎం కాదు ఏటీడబ్ల్యూ!
By: Tupaki Desk | 1 April 2019 5:41 PM GMTఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్న వేళ... హోరాహోరీగా సాగుతున్న ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు - ఆ పార్టీల నేతలు చేసే కామెంట్లు ఘాటుగానే ఉంటాయన్న విషయం పెద్దగా కొత్తేమీ కాకున్నా... ఈ ఎన్నికల్లో నేతల కౌంటర్లు - ప్రతి కౌంటర్లు మాత్రం మునుపెన్నడూ లేని రీతిలో వైరల్ అవుతున్నాయి. సినీ మాటల రచయితలను మించిపోయిన నేతలు... తమ ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చేస్తున్నారు. ఓ నేత నుంచి ఓ కౌంటర్ రాగానే... దానికి చాలా వేగంగా రివర్స్ పంచ్ కూడా వచ్చేస్తోంది. మొత్తంగా ఈ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ఇట్టే తేలిపోతుంది. ఇందులో భాగంగా నేడు ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఓ రేంజిలో ఫైరయ్యారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఓ ఏటీఎంగా మార్చేసుకున్నారని - కేంద్రం నిధులు ఇస్తుంటే.. చంద్రబాబు తన జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
ప్రాజెక్టుకు ఇచ్చిన నిధులను చంద్రబాబు తన సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని - అవినీతికి పాల్పుడుతున్నారని ధ్వజమెత్తారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ చేసిన వ్యాఖ్య బాగానే వైరల్ అయ్యింది. ఈ సమయంలో కడప జిల్లా పులివెందులలో ప్రచారం చేస్తున్న చంద్రబాబు కూడా చాలా వేగంగానే రియాక్ట్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాదని - అది ఏపీ ప్రజల పాలిట ఏటీడబ్ల్యేనేనని చంద్రబాబు రివర్స్ పంచ్ సంధించారు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అయితే... ఏటీడబ్ల్యూ అంటే ఏని టైం వాటర్ అట. ఇదే విషయాన్ని చెప్పిన చంద్రబాబు.. మోదీ చెప్పినట్లుగా పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అయితే... అది డబ్బుల్లేని ఏటీఎం అని మరో పంచ్ సంధించారు.
ఈ దిశగా చంద్రబాబు వినిపించిన వాదనను చూస్తే... *పోలవరం మనకందరికీ ఏటీఎం అంట! అసలు ఏటీఎంల్లో డబ్బులే లేవు. పోలవరంలో కూడా డబ్బుల్లేవు. రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వట్టిపోయిన ఏటీఎంగా మార్చేసింది. పోలవరం పూర్తిచేయడం నరేంద్ర మోదీకి ఇష్టంలేదు. అనేక అడ్డంకులు సృష్టించాడు. నేనిప్పుడు హామీ ఇస్తున్నాను - డిసెంబరు లోపల ప్రాజక్ట్ పూర్తవుతుంది. మోదీ - కేసీఆర్ - జగన్... మీ ఇష్టం వచ్చింది చేసుకోండి! నా సత్తా ఏంటో చూపించి పోలవరం పూర్తి చేస్తా. ఇప్పుడు చెబుతున్నా.. పోలవరం అంటే 'ఏటీఎం' కాదు... యస్.. పోలవరం అంటే 'ఏటీడబ్ల్యూ'. 'ఏటీడబ్ల్యూ' అంటే ఎనీ టైమ్ వాటర్ ఇన్ ద స్టేట్. ఒక బటన్ ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలనుకుంటే ఆ ఊరికి నీళ్లు వెళతాయి. కరెంటు మాదిరిగా నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాదే. ఎక్కడ కుళాయి తిప్పినా నీళ్లే. 24×7 నీళ్లు తెప్పిస్తా. గుజరాత్ లో మీరు చేయలేకపోయారు, నేనిక్కడ చేస్తున్నా, అదే మీకు కుళ్లు" అంటూ మోదీపై చంద్రబాబు తనదైన శైలిలో సెటైర్లు సంధించారు.