Begin typing your search above and press return to search.
బాబుకు నచ్చని ఐఏఎస్ లకు మూడినట్లేనట
By: Tupaki Desk | 9 April 2017 8:18 AM GMTఅసంతృప్తులు - ఆగ్రహావేశాల మధ్య ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణను పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. అది కూడా టీడీపీ ఆలోచనలకు అనుగుణంగా, 2019 ఎన్నికల లక్ష్యంగా అని సమాచారం. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత భారీగా బదిలీలు జరగగా, అదేస్థాయిలో ఒకట్రెండు రోజుల్లో మరోసారి బదిలీలు జరుగుతాయని వార్తలు వెలువడుతున్నాయి. సుమారు 30 మందికి స్థాన చలనం జరగనున్నట్లు తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇందులో పలువురు జిల్లా కలెక్టర్లు కూడా ఉంటారన్నది సమాచారం. తెలుగుదేశం పార్టీ నేతలతో సఖ్యతగా లేని వారిని ఆ పదవి నుంచి బదిలీ చేయడం ఖాయమని అంటున్నారు.
వివిధ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కలెక్టర్లకు అధికార పార్టీ శాసనసభ్యుల మధ్య సమన్వయం కొరవడినట్లు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్లు తమ మాట కనీసం లెక్కపెట్టడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు జిల్లాల టీడీపీ నాయకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తమకు-పార్టీకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని పార్టీ సమన్వయ సమావేశాల్లో నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను `సమన్వయం చేసుకుని` ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగించే వారి నే జిల్లా కలెక్టర్ పోస్టుల్లో నియమించాలన్న దిశగా జాబితా రూపొందించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో శ్రీకాకుళం - తూర్పుగోదావరి - గుంటూరు - ప్రకాశం - చిత్తూరు - అనంతపురం - కర్నూలు కలెక్టర్లను మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓల్లో ఒకరి మార్పు తథ్యమని ప్రచారం. అదేవిధంగా పలు శాఖల కార్యదర్శులు - కమిషనర్లకు కూడా శాఖల మార్పులుంటాయని సమాచారం. ఒక్కో అధికారికి ఒకటికి మించి శాఖలను అప్పగించి వారి సేవలను విస్తృతంగా ఉపయోగించుకుని ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కసరత్తు జరిపినట్లు తెలిసింది. తాజాగా మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తవడంతో ఉన్నతాధికారుల్లో కూడా మార్పులు చేర్పులు చేసి కొత్త బృందంతో ఎన్నికల దిశగా అడుగుల వేయాలన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు బదిలీల కూర్పు చేస్తునట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/