Begin typing your search above and press return to search.
బాబు ఈ సారి అన్నీ శుభవార్తలే చెప్తారట
By: Tupaki Desk | 24 March 2017 10:47 AM GMTఊహించని తీపి కబురు..అంతలోనే గందరగోళం అన్నట్లుగా సుమారు గత ఏడాదిగా వార్తల్లో నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక కొలిక్కి వచ్చిందని అంటున్నారు. ఈ దఫా తెలుగు తమ్ముళ్లుకు అన్నీ శుభవార్తలేనట. అయితే అదే సమయంలో జంప్ జిలానీలకు మాత్రం భారీ షాక్ అని చెప్తున్నారు. ఇంతకీ తాజాగా టీడీపీ వర్గాలు తాజాగా చెప్తున్న సమాచారం ఏంటంటే.... ఏపీ కేబినెట్ విస్తరణకు ఏప్రిల్ ఆరో తేదీని ముహూర్తంగా నిర్ణయించారట. అంతేకాదు ఇది కేవలం విస్తరణే తప్ప తొలగింపులు ఉండవని కూడా అంటున్నారు. అయితే పదవులు ఆశించో లేదా ఇంకో కారణంగానో పార్టీ ఫిరాయించిన వైసీపీ వారికి మాత్రం మొండి చెయ్యి తప్పదంటున్నారు.
దాదాపుగా గత ఏడాది నుంచి మంత్రివర్గ విస్తరణ, మార్పులు-చేర్పులు, తొలగింపుల గురించి ప్రచారం ఉంది. కనీసం నలుగురు, లేదా ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తారని ముందుగా ప్రచారమైంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. తన కుమారుడు లోకేష్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడం వల్లనే విస్తరణ వాయిదా పడినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఒత్తిడి ఎలాగూ ఉంది. అయితే ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి అన్నది తేల్చుకోలేకపోవడం, వారికి పదవులు ఇస్తే చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందుల ఏర్పడవచ్చనే కారణంగా కూడా విస్తరణ వాయిదా పడినట్లు కొన్నాళ్ల పాటు ప్రచారం సాగింది. చివరకు వచ్చే నెల ఆరో తేదీని విస్తరణకు ముహూర్తంగా ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అందుతున్న సంకేతాల మేరకు కేవలం చేర్పులు మాత్రమే ఉంటాయంటున్నారు. కొందరికి శాఖల మార్పు కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ప్రస్తుతం మంత్రి వర్గంలో 19 మంది మంత్రులు ఉండగా, నిబంధనల ప్రకారం ఆ సంఖ్యను 25 వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈక్రమంలో చేస్తున్న విస్తరణలో భాగంగా తన తనయుడు లోకేష్‌ను చంద్రబాబు మంత్రిగా తీసుకోనున్నారు. చాలాకాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావుకు కూడా మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా విశాఖ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు తనకు మౌళికాభివృద్ధి, పెట్టుబడుల శాఖ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు జరిగినే నారాయణ చేతుల్లో ఉన్న క్రిడా నుంచి కొంత భాగాన్ని గంటాకు అప్పగించాల్సి ఉరటురది. కళా వెంకటరావు పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ లేదా హోంశాఖను కోరుతున్నారని, వీటిలో ఏది కేటాయించినా చిన్న రాజప్ప లేదా అయ్యన్నపాత్రుడు శాఖలు మార్చాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. లోకేష్‌కు ఐటీ, ఎన్‌ఆర్‌ఐ శాఖలను ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇది ఖరారైతే పల్లె రఘునాథరెడ్డి శాఖనూ మార్పు చేయాల్సి వస్తుంది. ఈ మార్పులపై ఇప్పటికే ఒక జాబితా ఖరారైందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/