Begin typing your search above and press return to search.
బాబు ఆ పని చేస్తే ఎర్రబెల్లికి బ్యాండే !
By: Tupaki Desk | 15 Sep 2015 2:34 PM GMTటీ టీడీపీ సీనియర్ నేత - పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చేలా కనపడుతున్నారు. తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపట్టేందుకు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి కూడా పోటీపడుతున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లి రావడంతో ఈ పదవి తనకే వస్తుందన్న నమ్మకంతో ఎర్రబెల్లి ఉన్నారు. రేవంత్ - ఎర్రబెల్లి మధ్య సఖ్యత లేని విషయం తెలిసిందే. పైకి ఎవరికి వారు చేయి చేయి కలుపుకుంటున్నా లోపల మాత్రం టీ టీడీపీ పగ్గాల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే... రేవంత్ కేసులో చిక్కుకున్నా అది ఆయనకు ప్లస్ అవడం.
తాజాగా మంగళవారం విజయవాడలో చంద్రబాబు టీ టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణలో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కార్యకర్తల నుంచి ఐవీఆర్ ఎస్ సిస్టం ద్వారా అభిప్రాయ సేకరణ జరిపి అధ్యక్షుడిని ఎంపిక చేద్దామన్న ప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో టీడీపీకి 5 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. వీరందరి అభిప్రాయం తీసుకుంటే వీరిలో ఎక్కువ మంది రేవంత్ కే మొగ్గు చూపుతారన్న విషయాన్ని పార్టీలో మెజార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ లే చెపుతున్నారు. ఈ లెక్కన చూస్తే టీ టీడీపీ పగ్గాలు చేపట్టాలని ఎంతో ఆశతో ఉన్న ఎర్రబెల్లికి షాక్ తప్పేలా లేదు. ఐవీఆర్ ఎస్ లో ఓటింగ్ పెడితే ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణ పరిస్థితి ఏంటన్నదానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
ఏదేమైనా చంద్రబాబు ప్రతిపాదనతో ఎర్రబెల్లి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. ఇక ఎల్.రమణదీ అదే పరిస్థితి. ఈ విధానంలో ఎక్కవ ముంది కార్యకర్తలు రేవంత్ వైపే మొగ్గు చూపే ఛాన్సులున్నాయని...చంద్రబాబు కూడా చాలా తెలివిగా ఈ ప్రదిపాదన తీసుకువచ్చారని తెలుస్తోంది.