Begin typing your search above and press return to search.
6 వేల కోట్ల అవినీతి ఆరోపణలు-సమర్థించిన బాబు!
By: Tupaki Desk | 28 Nov 2018 8:09 AM GMTకేంద్ర మాజీ మంత్రి - టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్స్ పై ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) - ఐటీ అధికారులు చేసిన దాడులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. ఈడీ - ఐటీ సోదాలను బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ఠగా పేర్కొన్నారు. కమలనాథుల బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
అయితే - చంద్రబాబు స్పందనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టినట్లు - డొల్ల కంపెనీల స్థాపనతో అక్రమాలకు పాల్పడినట్లు పక్కా ఆధారాలతో సహా దొరికిపోయిన వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మద్దతు పలకడమేంటని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈడీ నోటీసులు జారీ చేస్తే వారి ముందుకు వెళ్లేందుకు కూడా సుజనా జంకుతున్నారని గుర్తుచేస్తున్నారు. అందుకే పార్లమెంటు సమావేశాల పేరు చెప్పి తాను విచారణకు హాజరుకాలేనని సుజనా అంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేయకపోయి ఉంటే సుజనా ధైర్యంగా ఈడీ ముందుకు వెళ్లేవారని సూచిస్తున్నారు. అలాంటి వ్యక్తిని వెనుకేసుకురావడం తగదని సూచిస్తున్నారు.
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా కేసులు నమోదైన వ్యక్తులను సమర్థిస్తే సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వాలు ఎంతో నయం.. సొంతవాళ్లను జైలుకు కూడా పంపాయి. కానీ మొహమాటానికి కూడా చంద్రబాబు సుజనా తప్పును ఒప్పుకోకపోగా పైగా సుజనాను సమర్థించడం ఏంటని అంటున్నారు. బాబు ఇంతగా తెగించడానికి కారణం సుజనా బాబు పార్టీకి కామధేనువు లాంటి వాడు కావడమే అంటున్నారు.
అవినీతి గురించి పదేపదే విమర్శలు చేసే బాబు... ఏకంగా 6 వేల కోట్ల అవినీతి ఆరోపణలు వస్తే మద్దతు ఇచ్చి మాట్లాడటంతో బాబు పూర్తగా పతనమయ్యారనే విషయానికి లైవ్ ఎగ్జాంపుల్ అంటున్నారు విశ్లేషకులు.