Begin typing your search above and press return to search.
రెండు రోజులు ఢిల్లీలో బాబు ఏం చేస్తారు?
By: Tupaki Desk | 4 Aug 2016 4:29 AM GMT‘‘ఇక్కడ నాకు చాలానే పనులున్నాయ్. ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మా ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెతారు’’ఇవి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలు. ఇలా మాట్లాడిన మూడు రోజులకే ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో ఉండనున్న ఆయన ఏం చేయనున్నారు? ఎవరెవరిని కలవనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే.. తన తాజా ఢిల్లీ పర్యటనను చంద్రబాబు పరివారం హోదాయేతర కారణాలు వివరిస్తోంది. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో.. పుష్కరాలకు రావాలంటూ రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి.. ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల్ని ఆహ్వానించటమే పనిగా చెబుతున్నారు. పైకి ఆహ్వానం పేరుతో కనిపిస్తున్న ఈ పర్యటన లక్ష్యం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఈ అంశంపై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది.. కృష్ణా పుష్కరాల పిలుపుల కోసమే తాజా పర్యటన అని తేల్చి చెబుతున్న వారు కొందరైతే.. మరికొందరు మాత్రం.. పిలుపులతో పాటు.. ప్రధాని మోడీతో ప్రత్యేక హోదా అంశంపై భేటీ కూడా ఉందన్న మాట చెబుతున్నారు.
కృష్ణా పుష్కరాలకు రాష్ట్రానికి రావాలంటూ రాష్ట్రపతి.. ఉపరాష్ట్రపతి.. ప్రధాని.. సప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లతో పాటు.. కీలకమైన పది మంది కేంద్రమంత్రుల్ని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రాల్ని ఇవ్వాలని చంద్రబాబు భావించారని.. అందుకు తగ్గట్లే ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ప్రత్యేక హోదా అంశంపై ప్రస్తుతం నడుస్తున్న రచ్చ నేపథ్యంలో.. ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా హోదా అంశంపై ఇరువురి మధ్య చర్చ రావటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన తర్వాత.. ఈ అంశంపై పెద్ద రచ్చే జరుగుతోంది. దీంతో కేంద్రం డిఫెన్స్ లో పడిన పరిస్థితి.
మిత్రపక్షంగా ఉన్న టీడీపీ పెద్దఎత్తున నిరసనలు చేస్తూ.. మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టటం.. దీనికి దేశంలోని పలు రాజకీయ పక్షాలు మోడీ సర్కారును వేలెత్తి చూపించటంతో.. సర్కారు నోటి నుంచి మాట రాని పరిస్థితి. హోదా ఇష్యూను ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనతో చెక్ చెప్పాలన్నట్లుగా ప్రధాని మోడీ ఆలోచన ఉందని చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఒక ఫార్మూలాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానప్పటికీ.. హోదా అంశం మీద బాబుతో ప్రధాని తాజా పర్యటనలో మాట్లాడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఈ రోజు (గురువారం).. రేపు (శుక్రవారం) రెండు రోజుల పాటు బాబు ఢిల్లీ పర్యటన పలు కీలక నిర్ణయాల్ని బయటకు ప్రకటించే వీలుండే అవకాశం ఉంది.