Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్ ద‌గా: వ‌న్ షాట్.. మెనీ బ‌ర్డ్స్‌!

By:  Tupaki Desk   |   2 April 2018 4:49 AM GMT
బాబు ఢిల్లీ టూర్ ద‌గా: వ‌న్ షాట్.. మెనీ బ‌ర్డ్స్‌!
X
దిక్కుమాలిన ఐడియాలు వేయ‌టంలో బాబుకు మించిన నేత తెలుగు నేల మీద ఎక్క‌డా క‌నిపించ‌రు. ఎంత‌సేప‌టికి త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నం త‌ప్పించి మ‌రింకేమీ ఆయ‌న‌కు ప‌ట్ట‌వంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. దీనికి త‌గ్గ‌ట్లే ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయి. గ‌డిచిన తొమ్మిది రోజులుగా మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెడుతూనే ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయిన‌ప్ప‌టికీ లోక్ స‌భ‌లో ఈ తీర్మానం చ‌ర్చ‌కు రాని ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. జ‌గ‌న్ నోటి నుంచి కీల‌క ప్ర‌క‌ట‌న ఒక‌టి రావ‌టం తెలిసిందే. హోదా సాధ‌న విష‌యంలో రాజీ లేని పోరాటం చేస్తున్నతాము.. అందుకు త‌గ్గ‌ట్లే లోక్ స‌భ స‌మావేశాలు ముగిసిన రోజే త‌మ ఎంపీలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి.. ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు దిగుతారంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

దీంతో స‌రికొత్త వ్యూహానికి తెర తీశారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో హోదా మీద అదే ప‌నిగా మాట‌లు మారుస్తున్న వైనం తెలిసిందే. హోదా సాధ‌న దిశ‌గా కేంద్రంపై ఒత్తిడి పెంచేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు గండి కొట్టేలా కొత్త ఎత్తుగ‌డ‌కు తెర తీశారు. బాబు తీరు చూస్తే.. వ‌న్ షాట్‌.. మెనీ బ‌ర్డ్స్ అన్న చందంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

హోదా సాధ‌న కంటే కూడా జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది. హోదా సాధ‌నే ముఖ్యం.. మ‌రేదీ త‌ర్వాతే అనుకున్న‌ప్పుడు ఆ దిశ‌గా ప్ర‌యాణిస్తున్న వారితో చేతులు క‌ల‌ప‌కున్నా.. వారికి చేత‌నైనంత తోడ్పాటు ఇవ్వ‌టం కూడా ముఖ్య‌మే. కానీ.. బాబులో అలాంటివేమీ క‌నిపించ‌వు. అవిశ్వాస తీర్మానం మీద జ‌గ‌న్ పార్టీ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత.. మైలేజీ లెక్క‌లు వేసుకొని హ‌డావుడిగా తానూ అవిశ్వాస తీర్మానం ఇవ్వ‌టం క‌నిపిస్తుంది.

తాజాగా ఎంపీల రాజీనామా.. ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష షురూ చేసిన వెంట‌నే ఢిల్లీలో త‌న‌దైన శైలిలో పావులు క‌దిపే ప్ర‌య‌త్నం షురూ చేశారు.

ఇప్ప‌టికే మోడీ స‌ర్కారుతో క‌టీఫ్ చెప్పిన బాబు.. ఆయ‌న‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ పొగిడిన నోటితోనే మోడీ అండ్ కోపై ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి వెళుతున్న ఆయ‌న‌.. రెండు రోజులు అక్క‌డే ఉండ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జాతీయ స్థాయి నేత‌ల‌తో ఆయ‌న భేటీ కానున్నారు. ఈ టూర్ ను రెండు ముక్కలుగా చేసి చూస్తే.. ఒక‌టి మోడీకి వ్య‌తిరేకంగా పావులు క‌ద‌ప‌టం.. రెండోది జ‌గ‌న్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌టంగా క‌నిపిస్తుంది.

తెలంగాణ ఉద్య‌మం చూస్తే.. ఉద్య‌మ‌నేత‌గా కేసీఆర్ అన్ని ప‌క్షాల వారిని ఒకే తాటి మీద‌కు తీసుకొచ్చారు. రాజ‌కీయ పార్టీగా త‌న నాయ‌క‌త్వాన్ని మిగిలిన పార్టీలు అంగీక‌రించ‌వ‌న్న విష‌యాన్ని గుర్తించి.. ముందుచూపుతో జేఏసీని ఏర్పాటు చేశారు. ఇందుకు అప్ప‌ట్లో త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న కోదండానికి బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. ఉద్య‌మం చేసే వేళ‌.. అంతిమ ల‌క్ష్య‌మే ముఖ్య‌మ‌నుకున్న‌ప్పుడు అంద‌రిని క‌లుపుకుపోవాలే కానీ.. నేను మాత్ర‌మే క‌నిపించాల‌న్న దురాశ ఉండ‌కూడ‌దు. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బాబులో ఆ క్వాలిటీ ఫుల్ గా ఉంద‌ని చెప్పాలి. ఇదే.. ఏపీకి శాపంగా మార‌నుంది.

తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బాబు ల‌క్ష్యాలు చూస్తే.. సింగిల్ జ‌ర్నీ.. బోలెడ‌న్నీ ప‌క్షులు అన్న చందంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదెలానంటే..

+ ఏపీకి మోడీ స‌ర్కారు ఎంత అన్యాయం చేస్తుంద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం

+ జాతీయ స్థాయి నాయ‌కుల‌కు ఒక వేదిక మీద‌కు తెచ్చి ఏపీకి జ‌రిగిన అన్యాయం పేరుతో మోడీ వ్య‌తిరేకుల‌ను ఒక చోటికి చేర్చే ప్ర‌య‌త్నం

+ మోడీకి వ్య‌తిరేకంగా జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌టం ద్వారా కేంద్రానికి చెక్ చెప్ప‌టం.. త‌న ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి వ్య‌వ‌హారాల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా ముంద‌ర‌కాళ్ల బంధాలు వేయ‌టం

+ ఏపీ స‌ర్కారుకు మోడీ ప్ర‌భుత్వం ఏం ఇచ్చింద‌న్న పుస్త‌కంతో బీజేపీ వాద‌న త‌ప్ప‌ని తేల్చ‌టంతో పాటు.. తానేం చేయ‌కుండా మోడీ ఎలాంటి క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డారోన‌న్న అంశాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చేయ‌టం.

+ పేరుకు మిత్ర‌ప‌క్ష‌మే అయినా.. మోడీ ఎలాంటి విలువ‌.. గౌర‌వం ఇవ్వ‌ర‌న్న మాట‌ను ప్ర‌చారంలోకి తేవ‌టం

+ మోడీ.. జ‌గ‌న్ క‌లిసి పోయార‌న్న ఊహాతో కూడుకున్న ఆరోప‌ణ చేయ‌టం ద్వారా బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేయ‌టం

+ జ‌గ‌న్ ను బ‌ద్నాం చేయ‌టం ద్వారా... హోదా సాధ‌న లీడ్ త‌న‌దేన‌న్న భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోనూ.. ఢిల్లీ స్థాయిలోనూ క‌లిగించే ప్ర‌య‌త్నం

+ తృతీయ ఫ్రంట్ ద్వారా జాతీయ‌స్థాయిలో పేరు తెచ్చుకుంటున్న ఒక‌ప్ప‌టి త‌న శిష్యుడు కేసీఆర్ కంటే మొన‌గాడిగా.. అంద‌రి ముందు బిల్డ‌ప్ ఇవ్వ‌టం

+ 2019 ఎన్నిక‌ల నాటికి మోడీ వ్య‌తిరేక శ‌క్తుల్ని ఒక వేదిక మీద‌కు తేవ‌టం.. కేసీఆర్ తృతీయ ఫ్రంట్ కు త‌న‌దైన శైలిలో చెక్ చెప్ప‌టం

+ హోదా సాధ‌న కంటే కూడా వ్య‌క్తిగ‌త పేరు ప్ర‌ఖ్యాతుల్ని పెంచుకోవ‌టం.. హోదా కోసం తానెంతో క‌ష్ట‌ప‌డుతున్న భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌టం