Begin typing your search above and press return to search.
హస్తినలో చంద్రబాబు ఏం ఉద్ధరించాడని?
By: Tupaki Desk | 5 April 2018 4:32 AM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు రోజుల పాటూ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. మొత్తంగా ఆయన ఏం సాధించారు? రాష్ట్రానికి ఏం ఒరిగింది. ఏం లాభం ఒనగూరబోతున్నది. రెండు రోజుల పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాలను కనీసం ప్రస్తావించారా? తాను అసలు ఢిల్లీ ఎందుకు వచ్చాడో.. వచ్చిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఎంత మేరకు సక్సెస్ అయ్యాడో.. ఆయన వివరించారా? లేదు! కేవలం మరోసారి ఢిల్లీ వేదికగా తనకు బాగా అలవాటు అయిన బూటకపు మాయ మాటలను బయటపెట్టి.. ఎంచక్కా.. భరత వాక్యం పలికేశారు.
చంద్రబాబు హస్తినయాత్రకు ముందు ప్రకటించిన ఎజెండా ప్రకారం.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడానికి, విభజన హక్కులను మొత్తం సాధించడానికి, కేంద్రం మీద ఒత్తిడి పెంచడానికి వీలుగా.. దేశంలోని అన్ని భాజపా - కాంగ్రెసేతర పార్టీల మద్దతు కూడగట్టడానికి వెళుతున్నా.. అని ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పుకున్నారు. నిజానికి ఆయన ఇతర పార్టీల్లో ఎవరి అపాయింట్ మెంట్లూ తీసుకోలేదు. వారిని కలవడానికి ముందస్తుగా సమయం ఫిక్స్ చేసుకోలేదు.
అలాంటి ప్రణాళిక ఏదీ లేదు గనుక.. అందరినీ కలిసినట్లు కనిపించడానికి.. చాలా తెలివిగా ఆయన తన జీవితంలో తొలిసారిగా పార్లమెంటు సెంట్రల్ హాల్ కు వెళ్లారు. అన్ని పార్టీల వారితో భేటీలు అని చెప్పుకుంటున్న పలకరింపులు, ముచ్చట్లు అక్కడే పూర్తయిపోయాయి. కేజ్రీవాల్ వంటి ఒకరిద్దరితో తప్ప ప్రత్యేకసమావేశాలు చెప్పుకోదగ్గవిగా జరగనేలేదు. కలిసిన పార్టీ నేతలు కూడా ఏపీ ప్రయోజనాలకోసం తాము మద్దతు ఇస్తున్నట్లుగా ఏ ఒక్కరూ కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అంటే చంద్రబాబు ఢిల్లీ యాత్ర అత్యంత దారుణంగా విఫలమైందని అర్థం అని ప్రజలు భావిస్తున్నారు. కానీ బాబు మాత్రం.. ప్రెస్ మీట్ పెట్టి.. చాలా మంది మాకు మద్దతిస్తున్నారు... అంటూ ఒక స్వీపింగ్ ప్రకటన చేశారు. విభజన నష్టాల గురించి రెండునెలలుగా ప్రతిరోజూ చెబుతున్నమాటలను ఢిల్లీ మీడియాకు చెప్పడానికి వెళ్లినట్లుంది తప్ప.. రాష్ట్రానికి మద్దతు కూడగట్టడానికి వెళ్లినట్లుగా లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు.